 
					Chittoor Mayor Couple Case Verdict: చిత్తూరు మేయర్ కఠారీ అనురాధ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగుర్ని దోషులుగా నిర్థారించింది. శుక్రవారం నిందితులకు మరణశిక్ష విధించింది చిత్తూరు ఆరో అదనపు కోర్టు. ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఘటన జరగడంతో తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈసందర్బంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
మేయర్ దంపతుల హత్య కేసుతో సంచలన తీర్పు
ఉరిశిక్ష పడినవారిలో మేయర్ భర్త మేనల్లుడు చింటూ కీలక నిందితుడు. ఈ కేసులో మొత్తం 23 మందిపై కేసు నమోదు చేశారు. దాదాపు పదేళ్లుపాటు సాగింది. 17 మంది నిర్ధోషులుగా ప్రకటించింది. విచారణ జరుగుతున్న సమయంలో మరో నిందితుడు మరణించాడు. అతడ్ని నిర్థోషిగా తేల్చింది. ఉరిశిక్ష పడినవారిలో చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేశ్‌లు ఉన్నారు.
పదేళ్ల కిందట ఏపీలో సంచలనం రేపింది చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసు. ఈ కేసు చివరి అంకానికి చేరడంతో శుక్రవారం ఆరో అదనపు న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించారు. మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతులను మేయర్ ఆఫీసులో అత్యంత దారుణంగా నరికి చంపారు. 2015 నవంబరు 17న ఈ ఘటన జరిగింది.
ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష
ఈ ఘటనపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు 22 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి రిమాండ్ లో ఉన్నారు నిందితులు. మూడేళ్ల నుంచి సాక్షుల విచారణ జరిగింది. ఏ-1గా మేయర్ భర్త మేల్లుడు చింటూ, ఏ-2గా వెంకటా చపలతి, ఏ-3 జయప్రకాష్‌రెడ్డి, ఏ-4 మంజునాధ్, ఏ-5 వెంకటేశ్‌లపై నేరం రుజువైంది.
మిగతా 16 మందిని నిర్ధోషులుగా తేల్చింది న్యాయస్థానం. ఈనెల 24న ఆరో అదనపు కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. శుక్రవారం నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి. ఏ-22గా ఉన్న రమేష్ ఈ కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేశారు. అతడ్ని తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఏ-21 శ్రీనివాసాచారి కేసు విచారణ సాగుతుండగానే మరణించిన విషయం తెల్సిందే.
ALSO READ: తుపాను నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా
నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఆ సమయంలో చింటూ-కఠారి వర్గాలకు చెందినవారు కోర్టుకు వచ్చారు. ఇరువర్గాల మధ్య అల్లర్లు జరగవచ్చని భావించారు. ఈక్రమంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు తర్వాత నిందితులను తిరిగి జైలుకు తరలించారు పోలీసులు. న్యాయస్థానం తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసేందుకు నిందితులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు కోర్టు సంచలన తీర్పు
మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త హత్యకేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు
ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు
చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేశ్‌లకు ఉరిశిక్ష
పదేళ్ల విచారణ అనంతరం వచ్చిన తుది… pic.twitter.com/zSdtQ3b15M
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025