 
					Raja Singh: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజుపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భవద్గీతపై ఆయన చేసిన కామెంట్లను తీవ్ర స్థాయిలో ఖండించారు. వెంటనే ఎమ్మెల్యే ఎంఎస్ రాజును టీటీడీ బోర్డు మెంబర్ నుంచి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎస్ రాజుకు హిందూ సంప్రాదాయాలపై నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మెంబర్లను నియమించేటపుడు.. వారికి హిందూమతం పట్ల, భగవద్గీత పట్ల , హిందూ సాంప్రదాయల పట్ల గౌరవం ఉందో లేదో.. ఒకటికి రెండుసార్లు పరీక్షించాలని రాజాసింగ్ సీఎం చంద్రబాబుని కోరారు.
అయితే ఎంఎస్ రాజు, మధకశిర ఎమ్మెల్యేగా పనిచేస్తూ, టీటీడీ ట్రస్ట్ బోర్డులో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇటీవల ఒక పబ్లిక్ మీటింగ్‌లో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి మత గ్రంథాల గురించి మాట్లాడుతూ, “భగవద్గీత వల్ల మన జీవితాలు మారలేదు, బైబిల్ వల్ల మార్పు రాలేదు, ఖురాన్ లేదా రంజాన్ వల్ల ముస్లింల భవిష్యత్తు మారలేదు. ప్రజల భవిష్యత్తు మారడానికి కారణం భారత రాజ్యాంగం మాత్రమే” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, భగవద్గీతను అవమానించినట్లుగా మాట్లడారు . భగవద్గీత హిందూ మతానికి అతి పవిత్రమైన గ్రంథంగా భావించబడుతుంది, దీనిని రాజ్యాంగం కంటే తక్కువగా చూడటం హిందూ భావనలను గాయపరిచిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు..
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, “ఎంఎస్ రాజు కేవలం ఎమ్మెల్యే కాదు, టీటీడీ బోర్డు సభ్యుడు కూడా. ఇటువంటి వ్యాఖ్యలు హిందూ సమాజ భావనలను దెబ్బతీస్తాయి” అని ఖండించారు. టీటీడీ బోర్డు సభ్యుడు జీ. భాను ప్రకాశ్ రెడ్డి కూడా, “గీత హిందూవుల జీవితంలో ఒక ముఖ్య భాగం. అయితే ఆయన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని గాయపరిచాయి. పబ్లిక్ క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. హిందూ సంస్థలు ఈ వ్యాఖ్యలను ‘సనాతన ధర్మానికి అవమానం’గా చూస్తూ, రాజును TDP నుంచి బహిష్కరించాలని, టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని కోరారు.
Also Read: విద్యార్థులకు అలర్ట్..! తెలంగాణ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్, హిందూ సంప్రదాయాల రక్షకుడిగా పేరుగాంచిన వ్యక్తి, ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, “ఎంఎస్ రాజుకు హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేదు. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాన్ని అవమానించడం ద్వారా ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా అర్హత కోల్పోయారు” అని ఆరోపించారు. రాజాసింగ్ వెంటనే రాజును టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని, TDP పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది మాత్రమే కాకుండా, టీటీడీ మెంబర్లను నియమించేటప్పుడు వారికి హిందూ మతం, భగవద్గీత, హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం ఉందో లేదో ఒకటి లేదా రెండుసార్లు పరీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. “ఇటువంటి వ్యక్తులు టీటీడీ లాంటి పవిత్ర సంస్థలో ఎలా ఉండగలరు? ఇది హిందూ భక్తుల భావనలతో ఆడుకోవటం” అని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 'భగవద్గీత' వ్యాఖ్యలపై రాజాసింగ్ ఫైర్
టీటీడీ బోర్డు సభ్యులను నియమించే ముందు వారికి మతపరమైన భావాలు ఉన్నాయా లేదా అనేది పరిశీలించిన తర్వాతే ఇవ్వాలని సూచించిన రాజాసింగ్
భగవద్గీత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే సస్పెండ్… pic.twitter.com/x9QOZxxE16
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025