CM Chandrababu Naidu: మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించారు. కొనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో ఆయన తుఫాన్ బాధితులను పరామర్శించారు. పర్యటనలో భాగంగా సీఎం, రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో, అక్కడ ఉన్న రైతుల గుంపులోని ఒక యువకుడిని పిలిచి, “ఏం చేస్తున్నావ్ తమ్ముడూ?” అని ఆరా తీశారు.
ఆ యువకుడు వెంటనే, “వ్యవసాయం చేస్తున్నాను సార్” అని బదులిచ్చాడు. యువకుడి సమాధానానికి ఆశ్చర్యపోయిన చంద్రబాబు, “చదువుకోవడం లేదా?” అంటూ తిరిగి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ప్రశ్నకు ఆ యువకుడు ఏమాత్రం తడబడకుండా, వ్యవసాయం ప్రాముఖ్యతను తెలిపేలా, “అందరూ చదువుకుంటూ పోతే, ఇక వ్యవసాయం ఎవరు చేస్తారు సార్?” అని సూటిగా ప్రశ్నించాడు. ఆ యువకుడి సమయస్ఫూర్తికి, వ్యవసాయం పట్ల అతనికున్న నిబద్ధతకు సీఎం చంద్రబాబు ఆశ్చర్యపోయారు. ఈ ఊహించని సమాధానం ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చినట్లయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CM: "ఏం చేస్తున్నావ్ తమ్ముడూ?"
YOUNG BOY: "వ్యవసాయం చేస్తున్నాను సార్"
CM: "చదువుకోవడం లేదా?"
YOUNG BOY"అందరూ చదువుకుంటూ పోతే, ఇక వ్యవసాయం ఎవరు చేస్తారు సార్?" pic.twitter.com/6p3iOqi1QT
— vijay marka (@VijayMarka88) October 30, 2025