 
					Nandamuri Tejaswini: నందమూరి ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు నాటిన విత్తనం.. పెద్ద వృక్షంగా మారింది. ఆ వృక్షాన్ని పట్టుకొని ఎన్నో కొమ్మలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాయి. తండ్రి పేరును నిలబెట్టడానికి కొడుకు బాలకృష్ణ… అన్న కొడుకులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఇలా ఒక్కొక్కరిగా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. రేపో మాపో బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ కూడా వెండితెరపై సందడి చేయనున్నాడు.
అయితే ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి హీరోలు రావడమే కానీ, హీరోయిన్లు అడుగుపెట్టింది లేద. నందమూరి కుటుంబంలో అమ్మాయిలు లేరా అంటే.. ఎందుకు లేరు చాలామంది ఉన్నారు. కానీ, ఇండస్ట్రీకి ఎవరు పరిచయం కాలేదు. ఇక బాలయ్య అక్కా చెల్లెళ్ల తరం అయ్యిపోయింది. ఇప్పుడు బాలయ్య కూతుళ్ల జనరేషన్ నడుస్తుంది. పోనీ బాలయ్యకు ఉన్న ఇద్దరు కూతుళ్లలో ఒక్కరైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారేమో అని చూసారు. కానీ, బాలకృష్ణ మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పి ఇద్దరు కూతుళ్ళకు పెళ్లి కూడా చేసేశాడు.
బాలకృష్ణ ఇద్దరు కుమార్తెలు అందానికి అందం.. అభినయం కలిసిన ముద్దుగుమ్మలు. పెద్ద కూతురు బ్రాహ్మణి.. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని వచ్చింది. అందంలో అప్సరస. చదువు అయ్యాక ఇండస్ట్రీకి వస్తుందేమో అనుకుంటే.. నారా లోకేష్ తో బాలయ్య పెళ్లి జరిపించాడు. ప్రస్తుతం బ్రాహ్మణి నారావారి కోడలిగా, బిజినెస్ విమెన్ గా క్షణం కూడా తీరిక లేకుండా పని చేస్తుంది.
ఇక చిన్న కూతురు తేజస్విని కూడా చక్కని చుక్క. అచ్చు తల్లి నోట్లో నుంచి ఊడిపడినట్లు ఉంటుంది. తల్లి అందం, తండ్రి రాజసంకలబోసిన తేజస్విని అయినా ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది అనుకుంటే.. బాలయ్య ఆమెకు కూడా వివాహాం చేసేశాడు. పెళ్లి తరువాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని.. ఈసారి మాత్రం తండ్రిని ఒప్పించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసి నిర్మాతగా మారింది. అఖండ 2 కి తేజస్వినినే సమర్పకురాలిగా ఉండడం విశేషం.
కేవలం నిర్మాతగానే కాకుండా మొట్ట మొదటిసారి నందమూరి కుటుంబం నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా కాకపోయినా.. ఒక జ్యూవెలరీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. సిద్దార్థ్ ఫైన్ జ్యూవెలరీకి తేజస్విని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యింది. దీంతో దానికి సంబంధించిన యాడ్ లో కూడా తేజస్వినినే నటించింది. తాజాగా ఈ యాడ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ యాడ్ చూస్తే తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వెళ్ళింది అనుకోరు. ఎంతైనా నటన అనేది వారి రక్తంలోనే ఉంది అని అనిపిస్తుంది. తేజస్విని చూస్తే హీరోయిన్స్ ఏ మాత్రం సరిపోరు. అంత అందంగా కనిపిస్తుంది. ముఖంలో భావాలను అద్భుతంగా పలికించింది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. తేజస్విని ముందు ముందు ఇండస్ట్రీలో కూడా కనిపిస్తుందేమో చూడాలి.
Nandamuri Tejaswini makes her graceful on-screen debut as the face of #SiddharthaFineJewellers#MTejeswiniNandamuri pic.twitter.com/nNBSv3BX5c
— H A N U (@HanuNews) October 31, 2025