 
					Hunting For Diamonds: సందట్లో సడేమియా అంటే.. ఇదేనేమో? మొంథా తుపాను బీభత్సంతో ఏపీ, తెలంగాణల్లోని చాలా ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు. వాగులోకి వరద వచ్చిందంటే చాలు.. అక్కడికి వెళ్లడానికి ఎవరూ సాహసం చేయరు. కానీ ఆ ప్రాంతాల ప్రజలు వరదొస్తే మంచిదని అంటున్నారు. ఎందుకంటే వాగులో వజ్రాలు దొరుకుతాయని వారి ఆశ. ఇంతకీ ఎక్కడ?
వాగు పొంగితే చాలు వేట మొదలు
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. నంద్యాల జిల్లాలో ఒకటే సందడి. ఓ ప్రాంతవాసులు ఎక్కడికి వెళ్లకుండా వాగుల వద్దకు చేరుకుంటారు. ఎందుకంటే చేపలు కోసం కాదండో య్. వరదతో వచ్చే వజ్రాల కోసం. నమ్ముడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. అసలు మేటరేంటి?
నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ గురించి అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలోని నల్లమల్ల అడవుల్లో వజ్రాల వేట సందడి మొదలైంది. మహానంది- శిరివెళ్ల సరిహద్దుల్లో వాగులు వద్ద వజ్రాల వేట కొనసాగుతోంది. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గం అది. ఆ ప్రాంతంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వక్కులేరు వాగు ఉంది. ఎగువన నల్లమల అడవిలోనుంచి ఈ వాగు ప్రవహిస్తూ వస్తోంది.
నంద్యాల జిల్లాలో వజ్రాల సందడి
అయితే భారీ వర్షాలకు వాగుల ద్వారా అడవుల నుంచి వజ్రాలు కొట్టు వస్తాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. వాగు పక్కనున్న ఒడ్డునలో వజ్రాలు దొరుకుతాయని నమ్ముతున్నారు ఆ ప్రాంత ప్రజలు. అందుకే వాగులోకి వరద వచ్చిన ప్రతీసారి అక్కడి ప్రజలు వజ్రాల కోసం వేట మొదలుపెడతారు.
ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆ ప్రాంతంలో వాగు ఉధృతంగా ప్రవహించింది. వరద ప్రవాహం తగ్గిన వెంటనే అక్కడ వాలిపోయారు వివిధ గ్రామాల ప్రజలు. కేవలం నంద్యాల నుంచి మాత్రమే పొరుగునున్న వివిధ జిల్లాల నుంచి అక్కడికి ప్రజలు చేరుకుంటారు. ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలు తీరుపోతాయని బలంగా నమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలో ఆ విధంగా చాలామందికి వజ్రాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి.
ALSO READ: అందరూ చదువుకుంటూ పోతే ఎలా? చంద్రబాబుకు యువకుడి ప్రశ్న
మహిళలు, యువకులు, వృద్ధులు ఇలా అన్నివర్గాల వజ్రాల ఆశతో వాగుల్లో గుంపులుగా కనిపిస్తున్నారు. చిన్ని జల్లెడలతో వాటిని సెర్చింగ్ చేస్తూ ఉంటారు. కేవలం నంద్యాల జిల్లా నుంచే కాకుండా ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి వజ్రాల కోసం వస్తున్నారు ప్రజలు. కొంతమంది సొంత వాహనాల్లో వస్తున్నారు. ఛార్జీలు లేకపోవడంతో మహిళలు ఆర్టీసీ బస్సులో అధికంగా వస్తున్నారు.
ఆ ప్రాంతంలో వరద విషయం తెలియగానే వ్యాపారులు సైతం అక్కడి చేరుకుంటారు. దొరికిన వాటిని అక్కడే కొనుగోలు చేస్తుంటారు. ఆ విధంగా గతంలో చాలామంది రైతులు లక్షాధికారులు అయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రత్నాల సీమ ఇదేనేమో.
నంద్యాల జిల్లా… ఆళ్ళగడ్డ…
నల్లమల్ల అడవుల్లో వజ్రాల వేట సందడి…
మహానంది – శిరివెళ్ల సరిహద్దుల్లో వాగులు , వాగుల కట్టల వద్ద వజ్రాల వేట ఉధృతంగా కొనసాగుతోంది…
తెల్లవారుజామునే వజ్రాల కోసం దూర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుతున్నారు…
ఇటీవల ఈ ప్రాంతంలో చిన్న చిన్న వజ్రాలు… pic.twitter.com/sWxe4VpH8v
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2025