BigTV English
Advertisement

Kurnool Bus Fire: కర్నూలు బస్సు ప్రమాదంలో మూడో వాహనం ప్రమేయం.. పోలీసులకు కీలక ఆధారాలు

Kurnool Bus Fire: కర్నూలు బస్సు ప్రమాదంలో మూడో వాహనం ప్రమేయం.. పోలీసులకు కీలక ఆధారాలు

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన స్లీపర్ బస్సు ప్రమాదంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. మొదట బస్సు వేగంగా వచ్చి బైక్ ని ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందని అనుకున్నారు. ఆ తర్వాత కింద పడిపోయిన బైక్ ని బస్సు ఢీకొని ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల ప్రమాదం జరిగిందని నిర్థారించుకున్నారు. ఇప్పుడు ఆ గ్యాప్ లో ఏం జరిగిందనే విషయాలు హైలైట్ అవుతున్నాయి. బైక్ కింద పడిన తర్వాత స్లీపర్ బస్సు ఆ బైక్ ని ఢీకొనే ముందు 14 వాహనాలు అదే రూట్ లో బైక్ ని దాటుకుని వెళ్లాయని పోలీసులు గుర్తించారు. ఈ 14 వాహనాల్లో ఓ బస్సు కూడా ఉంది. ఆ బస్సు బైక్ ని ఢీకొంది కానీ ప్రమాదం ఏమీ జరగలేదు. ఆ బస్సు ఢీకొనడం వల్ల బైక్ కాస్త పక్కకు జరిగింది. అది కూడా డివైడర్ నుంచి జరిగి రోడ్డు మధ్యలోకి వచ్చింది. ఆ తర్వాత స్లీపర్ బస్సు ఢీకొని దాన్ని ఈడ్చుకుని వెళ్లడం వల్ల ఘోరం జరిగిపోయింది. 19మంది సజీవ దహనం అయ్యారు.


అదే జరగకపోయి ఉంటే..?
కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత అలా జరగకపోయి ఉంటే అనే కోణంలో చాలా ప్రశ్నలు, సమాధానాలు వినపడుతున్నాయి. అసలు ఆ బైక్ యాక్సిడెంట్ జరిగి డ్రైవర్ చనిపోకపోయి ఉంటే ఆ రోజు రాత్రి ఆ బైక్ అక్కడ పడి ఉండేది కాదు, అదే లేకపోతే స్లీపర్ బస్సు యధావిధిగా సాఫీగా వెళ్లిపోయేది. సో ప్రమాదం జరిగే ఛాన్సే లేదు. పోనీ బైక్ డివైడర్ ని ఢీకొని పడిపోయింది, డ్రైవర్ శివశంకర్ చనిపోయాడు. అతని స్నేహితుడు శశివశంకర్ శవాన్ని పక్కకు లాగేశాడు కానీ బైక్ ని పక్కకు తీయలేకపోయాడు. ఈలోగా వరుసగా వాహనాలు రావడంతో అతను భయపడి పారిపోయాడని తెలుస్తోంది. ఒకవేళ అతడు బైక్ ని కూడా పక్కకు లాగగలిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. అది కూడా తీసేద్దాం. స్లీపర్ బస్సు, బైక్ ని ఢీకొని లాక్కెళ్లే లోపల 14 వాహనాలు అటుగా వెళ్లాయి. అందులో ఏ ఒక్క వాహనం ఆగి చూసినా ఆ బైక్ ని ఎవరో ఒకరు పక్కకు తీసేవారు. అప్పుడు కూడా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇక చివరిగా ఆ బైక్ ని ఢీకొన్న మరో బస్సు ఈ ప్రమాదానికి అసలు కారణంగా తెలుస్తోంది. ఆ బస్సు ఢీకొనడం వల్లే బైక్ డివైడర్ పక్కనుంచి కాస్త జరిగి రోడ్డు మధ్యలోకి వచ్చింది. దీంతో స్లీపర్ బస్సు దాన్ని ఢీకొని ఘోర ప్రమాదానికి కారణం అయింది. 19మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

ఆ మూడో వాహనం..
స్లీపర్ బస్సు ఢీకొనడానికి ముందు ఆ బైక్ ని ఢీకొన్న వాహనం ఇప్పుడు హైలైట్ అవుతోంది. అది ఒక ఓమ్ని బస్సు. ఆ బస్సు నడిపిన డ్రైవర్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. బైక్ రోడ్డుకి అడ్డుగా పడి ఉంది, దాన్ని తన బస్సు తాకింది అని తెలిసిన వెంటనే కనీసం ఆ డ్రైవర్ పక్కన బస్సు ఆపి దాని వద్దకు వెళ్లి ఉండాలి, లేదా వెనక వచ్చే వాహనాలను అప్రమత్తం చేసి ఉండాలి. అవేవీ జరగకపోవడం వల్ల ఈ ఘోరం జరిగిపోయింది. అంటే ఇక్కడ 19మంది ప్రయాణికులు చనిపోవడానికి కారణాలు అనేకం. ఇక్కడ నిర్లక్ష్యం ఒక్కరిదే అని చెప్పడానికి లేదు. అందరి నిర్లక్ష్యం కలగలిసి ఆ ప్రమాదానికి కారణం అయింది. చిట్టచివరిగా స్లీపర్ బస్సు డ్రైవర్ మంటలు చూసి పారిపోయాడే కానీ, ప్రయాణికుల్ని హెచ్చరించలేదు. అదే జరిగి ఉంటే కనీసం మరణాల సంఖ్య బాగా తగ్గి ఉండేది. అదృష్టం బాగుంటే అందరూ ప్రాణాలతో బయటపడేవారు. కానీ బస్సు డ్రైవర్ ఆ పని చేయలేదు. మంటలు చెలరేగగానే బస్సుని ఆపేసి భయంతో పరుగులు తీశాడు. కనీసం ఏ ఒక్కర్నీ అలర్ట్ చేయలేదని తెలుస్తోంది. ఇలా అందరి నిర్లక్ష్యం ఆ బస్సుని మంటల్లోకి నెట్టేసింది. 19మంది ప్రయాణికులు సజీవ దహణం కావడానికి కారణం అయింది.


Also Read: ఫేక్ ఫెలోస్ అంటూ మండిపడ్డ సీఎం.. ఏపీలో మొంథా రాజకీయం

Related News

CM Chandrababu Naidu: అందరూ చదువుకుంటూ పోతే ఎలా? చంద్రబాబుకు యువకుడి ప్రశ్న.. వీడియో వైరల్!

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు.. నెయ్యి సరఫరా వెనుక ఇంత హిస్టరీ ఉందా..?

Penna River: పెన్నా నదిలో చిక్కుకున్న ఇసుక పడవలు వెలికితీత.. తప్పిన పెను ప్రమాదం

YS Jagan: చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే రైతులకు తీవ్ర నష్టం.. జగన్ సంచలనం

Pawan Kalyan: తుపానుతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం.. యుద్ధ ప్రాతిపదికన పంటనష్టం అంచనా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

YS Sharmila: ఏపీపై మోదీకి సవతి తల్లి ప్రేమ: షర్మిల ఆగ్రహం

Mahabubabad: మార్చురీలో ఒక్కసారిగా కదిలిన శవం.. హడలిపోయిన సిబ్బంది.. అసలు ఏమైందంటే?

Big Stories

×