CM Chandrababu In Dubai: వివిధ దేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో మూడు రోజులు పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు, దుబాయ్‌లో ఏర్పాటు చేసిన సీఐఐ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అవసరమైతే పాలసీల్లో మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
దుబాయ్‌లో బిజీగా సీఎం చంద్రబాబు టీమ్
బుధవారం దుబాయిలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు టీమ్ హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దుబాయ్‌తో తనకు మంచి అనుబంధం ఉంది. దుబాయ్‌కి ఎప్పుడు వచ్చినా కొంత నేర్చుకుని వెళ్తానన్నారు. దుబాయ్ ఇచ్చిన విజన్-2071 తనను ఎంతోగానో ఆకట్టుకుందన్నారు.
భారతదేశం-ఆంధ్రప్రదేశ్ కూడా విజన్-2047 పెట్టుకుని పని చేస్తున్నామని తెలిపారు. ఏపీలో పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగుల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశం ఉందన్నారు. అవసరమైన మౌలిక వసతులు, మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
ఫ్యూచర్ మ్యూజియం సందర్శన
పోర్టులు, నేషనల్ హైవేలు, ఎయిర్‌పోర్టుల సరకు రవాణాకు ఏపీ అనుకూలంగా ఉందని, ఆ విధంగా ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొత్తగా పాలసీలు తెచ్చామని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఏపీకి మేలు జరుగుతుందనుకుంటే పాలసీల్లో మార్పులు చేయడానికి సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రానికి సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.
త్వరలో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఎయిర్ పోర్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు వేగంగా ఇస్తామన్నారు.
ALSO READ: ఏపీలో భారీ వర్షాలు.. ఇవాళ ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు
అంతకుముందు దుబాయ్‌లోని ఫ్యూచర్ మ్యూజియాన్ని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం చంద్రబాబు సందర్శన చేశారు. స్పేస్, వెదర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఏఐ వంటి రంగాల్లో భవిష్యత్తు ఆవిష్కరణలు ఎలా ఉండబోతున్నాయనేది సాంకేతికత ద్వారా తిలకించారు. అలాగే ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను విజిట్ చేశారు. విశాఖపట్నంలో నవంబరు 14, 15న రెండురోజులపాటు నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలను ఆహ్వానించారు సీఎం చంద్రబాబు.
దుబాయ్ కి ఎప్పుడు వచ్చినా, ఇక్కడ నుంచి ఎంతో నేర్చుకుని వెళ్తాను. దుబాయ్ ఇచ్చిన విజన్ 2071 ఎంతో ఆకట్టుకుంది. భారత దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా విజన్ 2047 పెట్టుకుని పని చేస్తున్నాం.#InvestInAP #CBNInDubai#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/HxXOMyypBm
— Telugu Desam Party (@JaiTDP) October 22, 2025
దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందర్శించారు. దీన్ని లివింగ్ మ్యూజింగ్‌గా రూపొందించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ వంటి రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది టెక్నాలజీని ఉపయోగించి… pic.twitter.com/UmKrVRLCOY
— Telugu Desam Party (@JaiTDP) October 22, 2025