హైదరాబాద్ లో రోజు రోజుకు మరిన్ని అడ్వెంచరస్ గేమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. జిప్ లైనింగ్, స్కై సైక్లింగ్ ను ఇష్టపడే వారికి సంతోషం కలిగించే న్యూస్ చెప్పింది కొండాపూర్ లోని హైదరాబాద్ బొటానికల్ గార్డెన్. చాలా కాలంగా సిటీలో విహారయాత్రలకు కేరాఫ్ గా నిలిచే ఈ గార్డెన్.. వాకర్స్, ఫ్యామిలీస్, ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 128 ఎకరాల కోతగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో విస్తరించి ఉన్న ఈ గార్డెన్, వెదురు తోటలు, సీతాకోక చిలుక గుంపులుతో కనువిందు చేస్తుంది. పూర్తి నీడతో కూడిన నడక మార్గాలతో నిండిన ప్రశాంతమైన వెదర్ ను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు తన పచ్చటి అందాలతో ఆకట్టుకున్న బొటానికల్ గార్డెన్.. ప్రస్తుతం సాహసోపేత కార్యకలాపాలకు కేరాఫ్ గా మారింది. అడ్వెంచరస్ ప్రియులు థ్రిల్ పొందేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. థ్రిల్ అనుభవించడానికి సిటీ నుంచి దూరం వెళ్లాల్సిన అవసరం లేదంటుంది.
బొటానికల్ గార్డెన్ లోపల అడ్వెంచర్ అరేనా సందర్శకులను, థ్రిల్ కోరుకునేవారికి ఆకట్టుకుంటుంది. వీటిలో అత్యంత కీలకమైనది జిప్ లైన్. ఇందులో పాల్గొనే వాళ్లు గార్డెన్ పాండ్ మీదుగా గ్లైడ్ చేసే అవకాశం కల్పిస్తుంది. అటవీ పరిసరాల కొత్త వ్యూన్ అందిస్తుంది. సేఫ్టీ బెల్ట్ లు, ట్రైనింగ్ పొందిన సిబ్బందితో రన్ చేయబడుతుంది. ఇది పెద్దలు, పిల్లలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది.
Read Also: అబ్బాయి, అమ్మాయికి కలిపి RAC సీటు.. చివరికి ఏం జరిగిందంటే?
జిప్ లైనింగ్ తో పాటు అడ్వెంచర్ ఏరియాలో స్కై సైక్లింగ్, రోప్ కోర్సులు, బుల్ రైడ్ లు, ఆర్చరీ, బంగీ జంపింగ్, ట్రాంపోలిన్ లాంటి ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు గార్డెన్ నిర్వాహకులు. ఇప్పటి వరకు మార్నింగ్ వాక్ కు డెస్టినేషన్ గా ఉండగా, బొటానికల్ గార్డెన్ ఇకపై విహారయాత్రలు, వీకెండ్ పిక్ నిక్, అడ్వెంచరస్ ఈవెంట్లకు కేరాఫ్ గా మారుతోంది. హైటెక్ సిటీ సమీపంలో పని చేసే, నివసించే వారికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. నగరంలోని ప్రజలకు కూడా మంచి ఆహ్లాదాన్ని పంచబోతోంది.
హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ ప్రతిరోజూ ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. గార్డెన్ లోకి తక్కువగా ఉంటుంది. అడ్వెంచర్ ఈవెంటకు టికెట్లు సఫరేట్ గా అందిస్తారు. జిప్-లైనింగ్ కోసం ఒక్కొక్కరికి దాదాపు రూ. 150 వరకు వసూళు చేస్తారు. ప్యాకేజీ, టైమ్ ను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. ఇతర అడ్వెంచర్ కార్యకలాపాలు రూ. 30 తీసుకుంటారు. అన్ని సేఫ్టీ ఎక్యుప్ మెంట్స్ ను ఈవెంట్లలో పాల్గొనే వారికి అందిస్తారు. టికెట్ బుకింగ్స్ నేరుగా గార్డెన్ కు వెళ్లి తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. ఇంకెందుకు ఆలస్యం.. సమయం దొరికితే మీరు కూడా వెళ్లి ఎంజాయ్ చేసేయండి!
Read Also: రాళ్ల మధ్యలో 3800 ఏళ్ల అద్భుత ఆలయం, అదీ హైదరాబాద్ లోనే!