BigTV English

GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్.. కోడళ్లతో ప్రభావతి పూజ.. సత్యం ఇంట దీపావళి సంబరాలు..

GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్.. కోడళ్లతో ప్రభావతి పూజ.. సత్యం ఇంట దీపావళి సంబరాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మనుషుల్ని పెట్టి కొట్టించిన నీకు బుద్ధి రాలేదా నన్ను ఇంకా వదలవా అని రోహిణి అంటుంది. నువ్వు మనుషులని పెట్టి కొట్టించినందుకే నీ మీద ఇంకా నాకు కసి పెరిగింది నీ గురించి అన్ని నిజాలను బయట పెట్టేస్తాను అని బెదిరించేస్తాడు. నువ్వు అర్జెంటుగా నాకు లక్ష రూపాయలు ఇవ్వకుంటే మీ ఇంటికి వచ్చి ఈ విషయాన్ని ఫోటోలతో సహా చూపిస్తాను అని రోహిణి బెదిరిస్తాడు. రోహిణి వెంటనే విద్య దగ్గరికి వెళ్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఆ దినేష్ గాడు వెంటనే లక్ష రూపాయలు ఇవ్వాలని అంటున్నాడు. నాకు భయంగా ఉంది ఎవడు అన్నట్లుగానే ఆ చేసేస్తాడేమో.. వాడికి కచ్చితంగా లక్ష రూపాయలు ఇవ్వాలి అని అనుకుంటుంది..


దినేష్ మనుషులు ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి అనగానే బయటకు వచ్చిన మీనాని కిడ్నాప్ చేసి తీసుకొని వస్తారు. బాలు మీనా ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలని టెన్షన్ పడుతూ ఉంటాడు.. విద్యా వాల ఇంటికి వెళ్లి మీనా ఇంకా రాలేదు ఎవరో తీసుకెళ్లారు అని చెప్తారు. మీనాను మొత్తానికి బాలు కనిపెడతాడు.. మీనా ని కాపాడాలని బాలు ఫిక్స్ అవుతాడు. రౌడీలను చితక్కొట్టేస్తాడు. దినేష్ దొంగ దెబ్బ తీసి బాలుని కొడతాడు. నా భర్తనే కొడతావని మీనా విశ్వరూపం చూపిస్తుంది.. సత్యభామ లాగా మరి అందరిని చావగొట్టేస్తుంది. పోలీసులు వచ్చి ఆ దినేష్ బ్యాచ్ ని తీసుకుని వెళ్ళిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి తన బండారం మొత్తం బాలుకి తెలిసిపోయిందని భయపడుతూ ఉంటుంది. ఇక వెంటనే వెళ్లి విద్యతో ఈ విషయాన్ని చెప్తుంది. బాలు మీనాలకు దినేష్ గురించి నా గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇంట్లో అందరికీ చెప్పేస్తారు నా పరిస్థితి అయిపోయింది అని బాధపడుతూ ఉంటుంది. నా రెండో పెళ్లి కూడా నిలబడలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక విద్య ఇప్పటికే ఆలస్యమైంది నీ తప్పు ఏమీ లేదని మొత్తం చెప్పేసేయ్ అని అంటుంది. రోహిణి ఎందుకు చెప్పు ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తన తప్పేమీ లేదని నిరూపించుకోవాలని అనుకుంటుంది..


మనోజ్ ఫోన్ చేయడం చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. కచ్చితంగా వీళ్ళకి నిజం తెలిసిపోయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి పూజ చేయాలి రోహిణి ఇంకా రాలేదా అని అంటుంది. నా ఇద్దరి కోడలతో నేను పూజ చేయించాలి అనుకున్నాను రోహిణి ఎక్కడ కనిపించలేదు అని అనుకుంటుంది. మీనా వదిన ఏం చేస్తుంది అమ్మ.. పేదింటి కుటుంబం నుంచి వచ్చిందని నువ్వు ఇంత చులకనగా చూస్తున్నావా అని రవి కూడా బాలు లాగా రెచ్చిపోతాడు.. ఇక అప్పుడే బాలు మీనా ఇంటికి రావడంతో సత్యం అదిగో బాలు మీనా వచ్చేసారు కదా అని సంతోష్ పడతాడు.

చూసావా అమ్మ మీనా వదిన వస్తే పూజ చేద్దామని అనలేదు. రోహిణి ఏది రా ఇంకా రాలేదా అని మనోజ్ పై సీరియస్ అవుతుంది ప్రభావతి. రోహిణి వస్తుంది లేమ్మా అని అంటాడు మనోజ్.. ఏమని ఉంటుంది కచ్చితంగా మీనా వాళ్ళ అమ్మగారింటికి నన్ను తీసుకొని వెళ్లి ఉంటుందని చెప్పి ఉంటుంది కదా ఈ ప్రభావతి అని బాలు అంటాడు. దానికి శృతి ఖచ్చితంగా శత్రువులు మనసు ఒకటేనని నిరూపించే వాళ్ళు అదే అంది అత్తయ్య అని అంటుంది.. అసలేం జరిగిందో తెలుసా అని బాలు చెప్పబోతుంటే మీనా ఆపుతుంది. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య పువ్వులను ఆర్డర్ చేసింది వెళ్లి వస్తుండగా టైర్ పంచరైంది ఈయనకు ఫోన్ చేస్తే ఈయన వచ్చాడు అని మీనా చెప్తుంది..

పండగ పూట కూడా ఈ రచ్చ ఏంటి మీరు ముగ్గురు బయటి నుంచి వచ్చారు కదా వెళ్లి ఫ్రెష్ చేయరండి అని సత్యం అంటాడు.. రోహిణి తన గురించి ఎక్కడ తెలిసిపోతుందో బాలు వాళ్ళు ఎక్కడ నిజం చెప్తారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే బాలు వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళగానే ఆ దినేష్ గాడు ముసలామెని గుద్ది పారిపోతుంటే పోలీసులకు అప్పగించాను. దానిమీద కోపంతోనే నేను కిడ్నాప్ చేశారు ఆ తర్వాత నువ్వు సత్యభామ లాగా రెచ్చిపోయావని చెప్పాల్సింది కదా అని అంటాడు. మీరు లేనిపోని గొడవలు ఇంటి మీదకు తీసుకొచ్చారని మళ్ళీ దీపావళి కన్నా పెద్దగా అరిచి మరి మీ అమ్మ మనల్ని తిడుతుంది అవసరమా అని మీనా అంటుంది.

Also Read : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

రోహిణి గురించి అసలు విషయం తెలియదేమో అని తెలుసుకున్నారు రోహిణి సంతోషపడుతుంది. అందరూ కలిసి అమ్మవారికి పూజ చేసి, టపాసులను కాల్చి ఎంతో సంతోషంగా ఉంటారు. వీళ్ళందరి సంతోషాన్ని చూసిన శోభా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెబుతుంది. ఈ సంతోషాన్ని మరింత సేపు ఉంచను కాసేపట్లో దూరం చేస్తాను అని అంటది. మీరు గది కోసం రోజు గొడవ పడుతున్నారు కదా నా వంతు సహాయంగా నేను ఐదు లక్షలు ఇస్తాను అని అంటుంది. బాలు రెచ్చిపోయి ఆమెకు బుద్ధి చాలా చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు తాగొచ్చాడని ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..కూల్ డ్రింక్ కోసం ఆడాళ్ళ ఫైట్..వల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై చక్రధర్ సీరియస్.. శ్రీయ పెద్ద గొడవ.. అవనికి సపోర్ట్ గా అక్షయ్..

Brahmamudi Serial Today October 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ తో కలిసి ఇంటికి వెళ్లిపోయిన కావ్య

Today Movies in TV : గురువారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today october 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఇంట్లోంచి వెళ్లిపోతానని అమర్‌కు చెప్పిన అమ్ము  

Tv Anchors : హీరోయిన్లను మించి యాంకర్స్ సంపాదన.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?

MeghaSandesham : ‘మేఘ సందేశం ‘ భూమి అసలు పేరేంటి..? ఒక్కరోజుకు ఎంతంటే..?

Big Stories

×