ChatGPT Atlas| OpenAI కొత్త AI వెబ్ బ్రౌజర్ చాట్‌జిపిటి అట్లాస్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ఇప్పటికే ఈ బ్రౌజర్ సంచలనం సృష్టిస్తోంది. ఈ బ్రౌజర్‌ని తొలిసారిగా వినియోగించిన వారు దీని గురించి ఫస్ట్ రివ్యూలు ఇస్తున్నారు. ముందుగా ఈ బ్రౌజర్ ChatGPT యాప్ యొక్క ఎక్స్‌టెన్షన్ అని భావించారు. కానీ, ఉపయోగించిన తర్వాత.. ఇది నిజంగా ఒక స్మార్ట్, స్పెషల్ బ్రౌజర్ అని చెబుతున్నారు. ఇంటర్నెట్ సెర్చింగ్ విధానాన్ని ఈ బ్రౌజర్ భారీ మార్పులు చేసిందని అభిప్రాయపడుతున్నారు.
AI అసిస్టెంట్లు ఇంటర్నెట్ సెర్చ్ పద్ధతులనే మార్చేశాయి. అంతకుముందు సెర్చ్ విధానంలో గూగుల్ లింక్‌లను క్లిక్ చేయాల్సి వచ్చేది. వాటి కోసం స్క్రోల్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ మోడ్ లో బ్రౌజింగ్ తో ఈ ప్రక్రియ తగ్గింది. యూజర్లకు ఈ ఏఐ బ్రౌజర్ వెంటనే సమాధానం ఇచ్చేస్తుంది. వెబ్ సైట్ లింక్స్ కు బదులు యూజర్లు ఇలా నేరుగా సమాధానం పొందడంతో సంతోషంగా ఫీలవుతున్నారు.
అట్లాస్ బ్రౌజర్ ఒకే సమాధానాన్ని ఇస్తుంది. వెబ్‌పేజీల లింక్‌లకు బదులు స్పష్టమైన జవాబు వస్తుంది. Google క్రోమ్ కూడా AI మోడ్‌లో దాదాపు ఇలానే చేస్తుంది. కానీ కింద లింక్స్ కూడా ఉంటాయి. అట్లాస్ లో దానికి బదులు స్పష్టమైన సమాధానంతో పాటు “Search” క్లిక్ చేస్తేనే సోర్స్ లింక్‌లు కనిపిస్తాయి. మరింత సమాచారం కావాలంటే, చిత్రాలు, వీడియోలు, వార్తల కోసం ప్రత్యేక ట్యాబ్‌లు ఉన్నాయి. సెర్చ్ విధానంలో ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది.
చాట్ జిపిట్ అట్లాస్ లో పైన కుడి వైపు “Ask ChatGPT” బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సైడ్‌బార్ తెరుచుకుంటుంది. AIతో పూర్తి అక్కడ కొత్తగా చాట్ చేయవచ్చు. ఫోటోలు, ఫైల్‌లను అటాచ్ చేయవచ్చు. మీరు ఉపయోగిస్తున్న ట్యాబ్‌ను రిఫర్ చేయవచ్చు. అదనపు సెర్చ్‌లకు ChatGPT టూల్స్ సహాయపడతాయి. ఇందులో డీప్ రిసెర్చ్, డీప్ థింక్ మోడ్స్ కూడా యాడ్ చేసి ఉన్నాయి. దీంతో సమాచారం సేకరణ సులభమవుతుంది.
సైడ్‌బార్ పూర్తి పేజీని సంక్షిప్తంగా సారాంశం చేస్తుంది. కీలక అంశాలను విడదీస్తుంది. దశలవారీగా వివరణ కూడా ఇస్తుంది. ఇది సంక్లిష్ట సమాచారాన్ని సులభం చేస్తుంది. AI బ్రౌజర్ మన జీవితాన్ని సులభతరం చేస్తుంది. సోర్స్‌లను కాపీ-పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ ఇతర బ్రౌజర్‌లలో ఇంత వరకూ లేదు.. ఇకపై వస్తుందా? టెక్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
బ్రౌజింగ్ రంగంలో ChatGPT Atlas కొత్త అనుభూతిని ఇస్తుంది. కామెట్ థీమ్, AI ఫీచర్‌లు సరదాగా ఉన్నాయి. కానీ, VPN, యాడ్-బ్లాకర్‌లు లేవు. కానీ యూజర్ ప్రైవెసీ పూర్తిగా వినియోగదారుడి నియంత్రణలో లేదు. కస్టమైజేషన్ పరిమితంగా ఉంది. ప్రామాణిక ఫీచర్‌లు లేకపోవడంతో కొంతమంది యూజర్లు దీన్ని ఉపయోగించడానికి సంకోచించవచ్చు. ఈ సమస్యను బ్రౌజర్ రెండో వెర్షన్ లో పరిష్కారించవచ్చు. అయినప్పటికీ, మొదటి వెర్షన్‌గా ఇది గొప్ప బ్రౌజర్ అనే చెప్పాలి.
Atlas ప్రస్తుతం macOSలో విడుదలైంది. Windows, iOS, Androidలో త్వరలో వస్తుంది. ChatGPT వినియోగదారులకు ఈ బ్రౌజర్ సర్వీస్ ఉచితం. పెయిడ్ ప్లాన్‌లకు ఏజెంట్ మోడ్ ప్రివ్యూ ఉంది. షాపింగ్ వంటి పనులను అట్లాస్ ఆటోమేట్ చేస్తుంది. సైడ్‌బార్ కాంటెక్స్ట్ జోడిస్తుంది. బ్రౌజర్ మెమరీ వ్యక్తిగతంగా సహాయం ఇస్తుంది. ఆప్ట్-ఇన్ లేదా ఆప్ట్-ఆవుట్ సులభం. ఏజెంట్‌లతో కొన్ని రిస్క్‌లు ఉన్నాయి. లాగ్-అవుట్ మోడ్‌ను జాగ్రత్తగా ఉపయోగించండి. OpenAI సమస్యలను త్వరగా పరిష్కరిస్తుంది. Atlas సూపర్-అసిస్టెంట్ భవిష్యత్తును లక్ష్యంగా చేసుకొని సేవలు అందిస్తుంది. ఈ ఫీచర్స్ పాపులర్ అయితే Google సెర్చ్ విధానం నీరసంగా అనిపిస్తుంది.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే