Pithapuram Govt Hospital: కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. చేబ్రోలుకి చెందిన దుర్గ మరణంపై పవన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ప్రసూతి సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. దుర్గ ప్రసూతి మరణంపై తక్షణం నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లాలో ప్రసూతి మరణాలపై ఎప్పటికప్పుడు మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.
కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రసూతి సమయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలి విధి నిర్వహణ తీరు, ఇతర సిబ్బంది వ్యవహారంపై విచారణ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. పిఠాపురం ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలో వైద్యం అందించే విధానం అందరికీ ఒక మోడల్ గా నిలవాలని.. ఆ దిశగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో దొండపాటి దుర్గ (30) బాలింతరాలు మృతి చెందింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అదేశాల మేరకు బుధవారం కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ నాయకులు జ్యోతుల శ్రీనివాసరావు బాలింతరాలు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాలింతరాలుకు జన్మించిన పసిబిడ్డకు జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Also Read: CM Chandrababu: పెట్టుబడుల వేటలో సీఎం చంద్రబాబు.. యూఏఈలో వరుస భేటీలు