ఏపీలో రెండు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒకటి రాష్ట్ర అసెంబ్లీ, రెండోది జగన్ అసెంబ్లీ. జగన్ ఎలాగూ అసెంబ్లీకి రారు కాబట్టి, ఆయన అక్కడ మాట్లాడాలనుకున్నవన్నీ ఒక పేపర్ పై రాసుకుని మీడియా(అనుకూల)ని పిలిపించుకుని మాట్లాడతారు. ఈరోజు జగన్ అసెంబ్లీ జరుగుతుందని వైసీపీ ప్రకటించింది. ఇంత వివరంగా మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి తాను అసెంబ్లీకి రానని చివర్లో ఎలాగూ ఓ సెంటిమెంట్ డైలాగ్ ఉండనే ఉంటుందని నెటిజన్లు ఈ ప్రకటనపై సెటైర్లు పేలుస్తున్నారు.
ఆయనే ప్రభుత్వం, ఆయనే ప్రతిపక్షం..
జగన్ అసెంబ్లీలో ఆయనే స్పీకర్, ఆయనే అధికార పార్టీ, ఆయనే ప్రతిపక్ష పార్టీ. కనీసం తన పార్టీలోని మిగతా 10మంది ఎమ్మెల్యేలకు కూడా ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వరు. అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడటం లేదు, కనీసం జగన్ పక్కన కూర్చుని అయినా మాట్లాడొచ్చు అనుకుంటే అది వారి అత్యాశే. కేవలం తాను మాత్రమే వన్ మ్యాన్ షో లాగా మాట్లాడి చివర్లో మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం దాటవేసి వెళ్లడం ఆయన ఆనవాయితీ అంటున్నాయి వైరి వర్గాలు.
Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address a press conference ( October 23, 2025 )
📍Central Office, Tadepalli
🕚11:00 AM#StayTuned ❗https://t.co/yFCv1eMb4HLive Link👆🏻#YSJaganPressMeet pic.twitter.com/avS994vVuW
— YSR Congress Party (@YSRCParty) October 22, 2025
ఎందుకిలా?
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం వల్ల తాను అసెంబ్లీకి రావడం లేదనేది జగన్ వాదన. ఆ హోదా ఇస్తే తనకు అసెంబ్లీలో అధికార పార్టీ నేతలతో సమానంగా మాట్లాడే అవకాశం ఇస్తారని, అప్పుడే తాను ప్రజల సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లగలనని అనేవారు. అలా ఇవ్వకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తాను అసెంబ్లీకి రావడం లేదంటారు జగన్. పోనీ వైసీపీ ఎమ్మెల్యేలనయినా పంపిస్తారా అంటే అది వాళ్లిష్టం అని మాట దాటేశారు. జగన్ ని కాదని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా? అందుకే వారు కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షం తరపున నిరసనలు, ధర్నాలు చేస్తున్న వారిలో ఎమ్మెల్యేలు లేరు అంటే అతిశయోక్తి కాదు. పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆళ్ల నాని, విడదల రజిని వంటి అతికొద్ది మంది మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు. ఎమ్మెల్యేలకంటే ఎమ్మెల్సీలు కాస్త హుషారుగా నిరసనల్లో పాల్గొనడం ఇక్కడ విశేషం. ఫైనల్ గా జగన్ మాత్రం అసెంబ్లీకి రాకుండా, ఇలా ప్రెస్ మీట్లతో పార్లల్ అసెంబ్లీని కొనసాగిస్తున్నారు. ఇక ఆయన జనంలోకి రావడమే మిగిలుంది.
Also Read: మాగంటి గోపీనాథ్ కు సునీత భార్య కాదా?
ప్రెస్ మీట్లతో లాభమేంటి?
జగన్ ప్రెస్ మీట్ ని టీడీపీ అనుకూల మీడియా సహా అందరూ ప్రసారం చేస్తారు. అయితే దానివల్ల లాభమేంటి అనేదే ప్రశ్నార్థకం. జగన్ ప్రెస్ మీట్లకు ఎలాగూ కూటమి నుంచి కౌంటర్లుంటాయి. అప్పుడు జనం ఎవరిని నమ్మాలి? ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ జగన్, ఇతర విషయాల్లో ఇరుక్కోవడం మినహా లాభం లేదని ఆ పార్టీనేతలే గుసగుసలాడటం విశేషం. మరి తాజా ప్రెస్ మీట్ తో వైసీపీకి లాభమేంటి? దానివల్ల కూటమికి కలిగే నష్టమేంటి? అనేది తేలాల్సి ఉంది.
Also Read: మోదీని మెప్పించిన నారా లోకేష్.. ఆ రెండు రాష్ట్రాలకు మంట