IND VS AUS 2nd ODI: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఇందులో టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. అటు ఆసీస్ బౌలింగ్ కు దిగింది. ఈ తరుణంలోనే రోహిత్ శర్మ, కెప్టెన్ గిల్ బ్యాటింగ్ కు దిగారు. అయితే, వీళ్లిద్దరూ బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గిల్ తప్పిదం వల్లే, రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. మొన్న వెస్టిండీస్ జట్టుపై యశస్వీ జైస్వాల్ 200 పరుగులు చేస్తాడనుకున్న సమయంలో గిల్ తప్పిదం వల్ల, రనౌట్ అయ్యాడు. అయితే, ఇవాళ కూడా రోహిత్ శర్మకు అలాంటి పరిస్థితే ఎదురైంది. కొంచెంలో రోహిత్ శర్మ రనౌట్ అయ్యేవాడు. అదిరిపోయే డైవ్ చేసిన తరుణంలో హిట్ మ్యాన్ రోహిత్ రనౌట్ నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మను రనౌట్ చేసేందుకు గిల్ ప్లాన్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. పిచ్ మధ్యలో వరకు రోహిత్ శర్మ పరుగుకు వెళ్లినా, గిల్ మాత్రం రాకుండా కుట్రలు చేశాడని ఫైర్ అవుతున్నారు. జస్ట్ మిస్ అయింది.. లేకపోతే రోహిత్ శర్మ ఔట్ అయ్యేవాడని అంటున్నారు. యశస్వీ జైస్వాల్ లాగానే రోహిత్ శర్మను రనౌట్ చేసేందుకు గిల్ పన్నాగం చేశాడని టీమిండియా ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (కెప్టెన్), కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
భారతదేశం (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్