BigTV English

HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!

HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!
Advertisement

HBD Prabhas:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సొంతం చేసుకున్నారు ప్రభాస్ (Prabhas). ముఖ్యంగా ఈయన తోటి నటీనటులే కాదు ఈయన కంటే చిన్న వయసు ఉన్నవారు కూడా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు. కానీ ప్రభాస్ మాత్రం 46 సంవత్సరాలు వచ్చినా ఇంకా వివాహం చేసుకోకపోవడంపై అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు..


46 ఏళ్లయినా పెళ్లిపై స్పందించని ప్రభాస్..

ఇదిలా ఉండగా ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు.. నేటితో 46 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. కనీసం ఈ ఏడాదైనా శుభవార్త చెబుతారా అని అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నాలుగేళ్లు గడిస్తే 50 సంవత్సరాలు అవుతాయి. 50 ఏళ్లలో పెళ్లి చేసుకొని ఏం ప్రయోజనం అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. నిజానికి ప్రభాస్ గతంలో త్రిష(Trisha) తో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ అనవసరంగా ఆ ప్రేమ అక్కడికే ఆగిపోయింది. ఆ తర్వాత అనుష్క శెట్టి (Anushka Shetty) తో ఏడడుగులు వేయబోతున్నారు అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తున్నా.. అది కాస్త కార్యం దాల్చలేదు. మరొకవైపు అభిమానులు అనుష్కశెట్టితో పెళ్లి జరిగినట్లు పిల్లలు కూడా పుట్టినట్లు ఏఐ ఆధారిత ఫోటోలు సృష్టించి సంతోష పడిపోతున్నారు. ఇలా ఫోటోలతో నైనా సంతృప్తి పడదాం అనుకుంటున్నారు కానీ అసలు సంతృప్తి మాత్రం దొరకడం లేదు.

ఇప్పటికైనా శుభవార్త చెబుతాడా?

మరొకవైపు ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు ఊరిస్తోందే తప్ప ప్రభాస్ పెళ్లిపై ఇప్పటివరకు ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా మొన్నా మధ్య ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. కానీ అది మాటల వరకే పరిమితమైంది. అందుకే ఈ ఏడాది 46 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.


ALSO READ:Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

ప్రభాస్ సినిమాలు..

ప్రభాస్ విషయానికి వస్తే.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అలరిస్తున్నారు. అప్పటినుంచి వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు హనురాగవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే యేడాది ఆగస్టు 14వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది . అలాగే కల్కి2 తోపాటు సలార్ 2, స్పిరిట్ వంటి చిత్రాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. మొత్తానికైతే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ వైవాహిక బంధం పై క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.

Related News

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్

Bandla Ganesh: జోష్ మూవీ కోసం సిద్ధూ ఆరాటం.. కట్ చేస్తే నెక్స్ట్ రవితేజ!

Samantha: నా విడాకులు వారికి సంబరాలు.. సమంత షాకింగ్ కామెంట్స్!

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

Telusukada: తెలుసు కదా సినిమా ఫస్ట్  ఛాయిస్ సిద్దు కాదా..చేతులారా హిట్ సినిమా వదులుకున్న హీరో?

Big Stories

×