Virat Kohli Duck: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd ODI ) మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. కేవలం 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా… పెర్త్ తరహాలోనే పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో మరోసారి కింగ్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. కేవలం నాలుగు బంతులు ఫేస్ చేసిన విరాట్ కోహ్లీ ఈ టోర్నమెంట్ లో రెండోసారి డకౌట్ అయి అందరిని నిరాశపరిచాడు. దీంతో టీమ్ ఇండియా అభిమానులు డీలా పడిపోయారు. ఈ డకౌట్ తో విరాట్ కోహ్లీ ( Virat Kohli Duck) చెత్త రికార్డు కూడా నమోదు చేసుకున్నాడు. తన ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇప్పటి వరకు 40 సార్లు డకౌట్ అయ్యాడు. ఓ స్టార్ ఆటగాడు 40 సార్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి.
మొదటి వన్డేలో విఫలమైన విరాట్ కోహ్లీ రెండో వన్డేలో కూడా డకౌట్ అయ్యాడు. కచ్చితంగా ఆడాల్సిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో ఆయన అభిమానులు పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఎన్నో అంచనాలు పెట్టుకొని స్టేడియానికి వచ్చిన విరాట్ కోహ్లీ అభిమానులకు నిరాశ ఎదురయింది. జేవియర్ బార్ట్‌లెట్ వేసిన అద్భుతమైన బంతికి ఎల్బీడబ్యూ అయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో ఇప్పటి వరకు తన అంతర్జాతీయ క్రికెట్ లో 40 సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అటు రోహిత్ శర్మ ఇప్పటి వరకు 34 సార్లు డకౌట్ కాగా, సచిన్ టెండుల్కర్ కూడా 34 సార్లు డకౌట్ అయ్యాడు. ఇషాంత్ శర్మ 40 సార్లు డకౌట్ అయిన సంగతి తెలిసిందే. జహీర్ ఖాన్ అత్యధికంగా 43 సార్లు డకౌట్ అయ్యాడు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd ODI ) మధ్య జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ ( Rohit Sharma ) అద్భుతంగా రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ తో పాటు శుభమాన్ గిల్ ఔట్ ( Gill) అయినప్పటికీ, బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం 56 బంతుల్లో 26 పరుగులు చేసిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వన్డేలలో ఆస్ట్రేలియా గడ్డపై కంగారుల జట్టు పైన 1000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ తర్వాత ఆ జాబితాలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 802 పరుగులు మాత్రమే చేశాడు. సచిన్ టెండూల్కర్ 740 పరుగులు చేయగా మహేంద్ర సింగ్ ధోని 684 పరుగులు చేశాడు. అటు శిఖర్ ధావన్ 517 పరుగులు సాధించాడు.
HEARTBREAKING MOMENTS FOR INDIAN FANS. 💔
– Adelaide crowds giving standing ovation to Virat Kohli & He acknowledged..!!!
— Tanuj (@ImTanujSingh) October 23, 2025