E-Paper
Advertisement

రూటు మార్చిన సీఎం చంద్రబాబు.. చేపలు వండి, మత్స్యకారుడి ఇంట్లో చేపల భోజనం, ఆనందంలో

రూటు మార్చిన సీఎం చంద్రబాబు.. చేపలు వండి, మత్స్యకారుడి ఇంట్లో చేపల భోజనం, ఆనందంలో
Advertisement

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూటు మార్చారు. పేదలతో మమేకం కావడమేకాదు.. టీ, కాఫీలు, చివరకు భోజనం కూడా వాళ్ల ఇంట్లో చేస్తున్నారు. నార్మల్‌గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ ఇంట్లో ఇవన్నీ చేయడంతో ఆశ్చర్యపోతున్నారు సామాన్యులు. సీఎం చంద్రబాబులో ఎంత మార్పు వచ్చిందంటూ చర్చించుకోవడం ఏపీవాసుల వంతైంది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మత్స్యకారుడి కుటుంబంతో కలిసి చేపలతో భోజనం చేశారు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.

రూటు మార్చిన సీఎం చంద్రబాబు

Advertisement

సీఎం చంద్రబాబు ఏ ప్రాంతానికి వెళ్లినా నిత్యం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలంటే సెక్యూరిటీని దాటి వెళ్లాల్సిందే. ఒకప్పుడు తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని భావించేవారు ప్రజలు. తాము ప్రజా సేవలకు చెప్పే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు. ఈసారి సెక్యూరిటీ అంతా పక్కన పెట్టేశారు. వెళ్లిన ప్రతీ నియోజకవర్గంలో అక్కడి ప్రజలతో మమేకం అవుతున్నారు సీఎం చంద్రబాబు. తాను మీలాంటి మనిషేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫించన్లు సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పేదల ఇళ్లకు వెళ్లారు. అక్కడే టీ, కాఫీ తీసుకున్నారు.

మంగళవారం నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. తమ్మలపెంట గ్రామంలోని ఓ మత్య్సకారుడి ఇంట్లో భోజనం చేశారు. అధికార వాహనం దిగిన వెంటనే స్థానిక మత్స్యకారులతో కలిసి చేపల మార్కెట్‌కి వెళ్లారు. అక్కడ చేపలు అమ్ముతున్న స్థానిక మహిళలతో కలిసి కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత చేపలను కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు, స్థానిక మత్య్సకారుడు బాబు ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లారు. మత్య్సకారుడి భార్య చేపలను వండారు.

Advertisement

మత్స్యకారుడి ఇంట్లో చేపల భోజనం, ఆనందంలో ఆ ఫ్యామిలీ

అయితే చేపల పులుసు పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి అక్కడే ఉండి ఆమె వండే విధానాన్ని పరిశీలించారు. అలాగే అక్కడికి ఏయే రకాలు చేపలు వస్తాయో తెలుసుకున్నారు. ఆ తర్వాత బాబు కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు భోజనం చేశారు. ఆ తర్వాత బయలు దేరే ముందు మత్య్సకారుడి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు గ్రామంలోని మత్య్సకారులతో మమేకం అయ్యే సమయంలో కనీసం సెక్యూరిటీ చుట్టుపక్కల కనిపించలేదు.  మత్య్సకారుడి కుటుంబసభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మా ఇంటి దగ్గర భోజనం చేయడం నమ్మలేకపోతున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలోగానీ,  కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు ప్రజలతో మమేకం అవుతున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు.

ALSO READ: ఏపీ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక.. తీవ్ర వడగాల్పులు, ఆపై 47 డిగ్రీలు

 

 

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×