BigTV English

Prakasam barrage: ప్రకాశం బ్యారేజ్ గేట్ల డ్యామేజ్ పరిస్థితి ఏంటి? సీఎం చంద్రబాబు, నిపుణుడు కన్నయ్య పరిశీలన.. కాకపోతే..

Prakasam barrage: ప్రకాశం బ్యారేజ్ గేట్ల డ్యామేజ్ పరిస్థితి ఏంటి? సీఎం చంద్రబాబు, నిపుణుడు కన్నయ్య పరిశీలన.. కాకపోతే..

Prakasam barrage: విజయవాడపై ప్రకృతి కన్నెర్ర చేసింది. సిటీని ముంచేయడమేకాదు.. చివరకు ప్రకాశం బ్యారేజ్‌ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వరద ప్రవాహానికి ఇసుక బోట్ల వచ్చి బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో రెండు గేట్లకు సంబంధించిన దిమ్మెలు దెబ్బతిన్నాయి.


ఏపీలో వరద సహాయక సేవలు స్పీడుగా జరుగుతున్నాయి. ఓవైపు బాధితులకు సహాయం చేస్తూనే,ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.ఇంకో వైపు జరుగుతున్న నష్టాన్ని అధికారులు ఓ వైపు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా వరద ప్రవాహానికి ఇసుక బోట్ల వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో గేట్లకు సంబంధించిన దిమ్మెలు డ్యామేజ్ అయ్యాయి.

ALSO READ: విజయవాడ వరదలను క్యాష్ చేసుకుంటున్న ట్రాక్టర్ యజమానులు


సోమవారం సాయంత్రం సీఎం చంద్రబాబు బ్యారేజ్‌కి వచ్చి డ్యామేజ్ అయిన గేట్లకు సంబంధించిన దిమ్మెల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గేట్ల నిఫుణుడు కన్నయ్యనాయడు.. మంత్రి నిమ్మల రామానాయడుతో కలిసి రాత్రి బ్యారేజ్ వద్దకు వచ్చారు.

దెబ్బతిన్న 67, 69 నెంబరు గేట్లను కన్నయ్యనాయుడు పరిశీలించారు. ప్రకాశంబ్యారేజ్‌కి ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలో దెబ్బతిన్న ప్రాంతంలో పనులు చేపడతామని చెప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తుంగభద్ర డ్యాం తరహాలో ఇక్కడ గేట్ పూర్తిగా కొట్టుకుపోలేదని, కేవలం కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయని వివరించారు.

దక్షిణాదిలో డ్యామ్ గేట్ల నిఫుణుడు కన్నయ్యనాయుడు. ఇటీవల తుంగభద్ర డ్యామ్ గేటు డ్యామేజ్ అయ్యింది. వెంటనే కన్నయ్యను ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సంప్రదించడంతో ఆయన రంగంలోకి దిగారు. వదర ఉద్దృతి తగ్గాక పనులు మొదలుపెట్టారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారం కిందట జలవనరుల శాఖ సలహాదారుగా కన్నయ్యనాయుడిని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది.

ఇదిలావుండగా ప్రకాశం బ్యారేజ్ గేట్లకు సంబంధించిన దిమ్మెలు డ్యామేజ్ కావడంతో సీఎం చంద్రబాబు అనుమానం వ్యక్తంచేశారు. ఇసుక బోట్లు నేరుగా వచ్చి గేట్లను ఢీ కొట్టడం వెనుక ఏదో కుట్ర జరిగి ఉంచవచ్చననే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వివేకా హత్య విషయాన్ని గుర్తుచేశారు.

 

 

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×