E-Paper
Advertisement

Alluri Bus Accident: అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. బాధితులకు అండగా ఉంటామని హామీ

Alluri Bus Accident: అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. బాధితులకు అండగా ఉంటామని హామీ
Advertisement

Alluri Bus Accident: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు, 35 యాత్రికులు ఉన్నారు. భద్రాచలం ఆలయం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికుల ప్రైవేటు బస్సు అల్లూరి జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్ లో లోయలో పడి పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

యాత్రికుల దుర్మరణం బాధాకరం- పవన్ కల్యాణ్

Advertisement

“అల్లూరి జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలవ్వడం తెలిసి చింతిస్తున్నాను. యాత్రికుల బస్సు చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా సమాచారం అందింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది” -డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Also Read: Bus Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా.. స్పాట్లోనే 8 మంది మృతి

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం- మంత్రి లోకేశ్

Advertisement

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై హోంమంత్రి అనితతో ఫోన్ లో ఆరా తీశానన్నారు. సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగేలా చూడాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Related News

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×