BigTV English

CM Chandrababu Discuss Lakshmi Mittal: మిట్టల్ గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ.. భావనపాడు గురించి

CM Chandrababu Discuss Lakshmi Mittal: మిట్టల్ గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ.. భావనపాడు గురించి

CM Chandrababu Discuss Lakshmi Mittal: ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు టీమ్. మిట్టల్ గ్రూప్ ఛైర్మన్ లక్ష్మిమిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమయ్యారు. ఏపీలో గురించి వివరిస్తూనే, పెట్రో కెమికల్, గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలున్న ఉన్నాయని వివరించారు. వీటికి భావనపాడు కేరాఫ్‌గా మారనుందని మ్యాపింగ్‌తో సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


దావోస్ పర్యటనలో భాగంగా మంగళవారం మిట్టల్ గ్రూప్ ఛైర్మన్ లక్ష్మి మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. దాదాపు గంటలకు పైగా జరిగిన సమావేశం జరిగింది. ఆరునెలల కిందట కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందని, ఏపీకి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. పెట్టుబడుల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి అన్నివిధాలుగా సహాయ సహకారాలున్నాయని వివరించారు.

ఏపీలో పెట్రో కెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో ఉన్న అవకాశాలు గురించి మిట్టల్‌కు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా భావనపాడును పెట్రోకెమికల్ హబ్‌గా మార్చడానికి మిట్టల్ గ్రూప్ సహకారం కోరారు మంత్రి లోకేష్. భావనపాడు-మూలపేట ప్రాంతం ఆర్ అండ్ డీ, లాజిస్టిక్స్, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు.


హెచ్ పీసీఎల్- మిట్టల్ సంయుక్తంగా మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ. 3,500 కోట్లతో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.

ALSO READ: మరోమారు తెరపైకి రెడ్ బుక్.. నెక్స్ట్ ఎవరు?

ఏపీ ప్రతిపాదన పట్ల మిట్టల్ సానుకూలంగా స్పందించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశంలో లక్ష్మీమిట్టల్, ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఏపి ఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.

 

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×