BigTV English

Intinti Ramayanam Today Episode : పల్లవికి క్లాస్ పీకిన అవని.. పల్లవి కన్నింగ్ ప్లాన్..

Intinti Ramayanam Today Episode : పల్లవికి క్లాస్ పీకిన అవని.. పల్లవి కన్నింగ్ ప్లాన్..

Intinti Ramayanam Today Episode January 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి అవనిపై పార్వతికి లేని పోనివి చెబుతుంది. ఇదంతా నా తప్పే నన్ను క్షమించండి అంటుంది.. నీ తప్పేమి లేదమ్మా నువ్వు అన్నది నిజమే కదా అని అంటుంది. పల్లవిని గుడ్డిగా నమ్మేస్తుంది. ఇక పల్లవి ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంబర పడిపోతుంది. అత్తయ్య నా ప్లాన్ లో ఇరుక్కుందని అనుకుంటుంది. అవని అత్తయ్య అలా మాట్లాడటం పై బాధను వ్యక్తం చేసింది. కోడలి కోసమే ఇదంతా జరుగుతుందని పార్వతి తెలుసుకోలేక పోతుంది. అవని మొత్తం చేసిందని మనసులో కోపాన్ని పెంచుకుంటుంది. ఇక కమల్ ఇంట్లో జరుగుతున్న వాటిని చూసి బాధపడతాడు. అందరు ఇలా చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్యకు అమ్మ మీరు ఎంత ప్రేమ ఉందో చూసాం అమ్మకు అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో అన్నయ్య బర్త్డే రోజే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ ఎవరికి వారే అన్నట్టు ఉంటే అందరూ ఇద్దరిని చూసి బాధపడుతున్నారని కమల్ ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తాడు.. తల్లి బాధను చూడలేక పోయిన కమల్ తల్లిని, అన్నయ్యను ఏదొక విధంగా కలపాలని అనుకుంటాడు. పార్వతి, అక్షయ్ బాధను కమల్ దూరం చేస్తాడు. ఇంట్లోని అందరు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రియ శ్రీకర్లు చూడటానికి ఇంటికి వస్తారు. రాజేంద్రప్రసాద్ మాత్రం మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అరుస్తాడు.. ఇంట్లోంచి వెళ్లిపొమ్మని గెంటేస్తాడు. పార్వతి మాత్రం తన కొడుకు ఇంట్లోకి వస్తే తప్పేంటని రాజేంద్రప్రసాద్ ని నిలదీస్తుంది. ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది.. అవని శ్రీకర్ నేను రావద్దని చెప్పాను కదా మరి ఎందుకు వచ్చావు అని అంటుంది. బలవంతంగా శ్రీకర్ని శ్రీయాను ఇంట్లోంచి బయటకు వెళ్లమని చెబుతుంది. ఇది మాత్రం టెన్షన్ పడుతుంది.. అవని వాళ్ళని ఇంట్లోంచి బయటికి వెళ్లడం ఏంటని పల్లవి పార్వతికి మళ్లీ నూరిపోస్తుంది. పార్వతి నాదంతా అర్థమైంది నువ్వేం చెప్పద్దు అని అంటుంది.. ఇక అవని నేను బయటకు వెళ్తున్నానని చెప్తుంది. అక్షయ్ ఆగు నేను రెడీ చేసి వస్తాను అనేసి అంటే వద్దు అవసరం లేదండి నేను వెళ్లేసీ వస్తానని అంటుంది. సరే ఎక్కడికి వెళ్తున్నావు అదన్న చెప్పు అని అక్షయ్ అడుగుతాడు. అవని నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తుంది. అయితే నేను వస్తాను నీకు ఏం తెలుసు నువ్వు వెళ్తున్నావు ఆస్తి గురించి నీకు ఏదైనా తెలుసా అంటాడు కానీ అక్షయ్ ని మీరు వద్దండి నేనే వెళ్లి నాకు తెలుసు ఎలా చేయాలో అలా చేయించి మీకు సర్ప్రైజ్ ఇస్తానని అంటుంది.

ఎదురుగా పల్లవి వచ్చి ఆగుతుంది.. అక్క ఎక్కడికెళ్తున్నావు చెప్పవా అక్క నేను వస్తాను నీ తోడుగానంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు నీ నక్కబుద్ధి నాకు తెలుసు కదా నిన్ను తోడు తీసుకెళ్తానని ఎందుకు అనుకుంటున్నావు అసలు నువ్వు ఎవరు నన్ను అడగడానికని అవని అంటుంది. దానికి పల్లవి ఇంట్లో నేను చిన్న కోడలిని చిన్న కొడుకు భార్యని అది మర్చిపోతున్నావా నిన్ను అడిగే అధికారం నాకు కూడా ఉంటుంది అక్క అనేసి అంటుంది. నువ్వే అంటున్నావ్ కదా అన్నిట్లో చిన్న చిన్న అని మరి చిన్నదానివి పెద్ద వాళ్ళని ప్రశ్నించే అధికారం మీకు ఉందా అనేసి అడుగుతుంది అవని. నేను వస్తానని చెప్పాను కదా అక్క ఎక్కడికెళ్తున్నావ్ చెప్పడానికి భయపడుతున్నావా అంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను అని అందరికీ కావాల్సినట్లే నేను న్యాయం చేస్తానని చెప్పి వెళ్తుంది. పల్లవి లాయర్ దగ్గరికి అయితే నేను వస్తానంటుంది అవసరం లేదని చెప్పాను అని అవని అరుస్తుంది అప్పుడే అక్షయ వచ్చి ఏమైందని అడుగుతాడు. నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను అండి మిమ్మల్ని వద్దన్నాను తనని ఎందుకు తీసుకెళ్తాను అని అవని అంటుంది.


లాయర్ దగ్గరికి వెళ్లిన అవని ఆస్తి పత్రాలు మొన్న మార్చి రాయమని చెప్పారు కదా ఇప్పుడు మార్చు రాయాలి అనేసి లాయర్ ని అడుగుతుంది. దానికి లాయరు మీ మావయ్య గారు ఒప్పుకున్నారు అమ్మ మరి మీ మామయ్య గారు ఒప్పుకోకుండా ఎలా రాయాలి అనేసి అంటాడు. మావయ్య గారిని ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించే బాధ్యత నాదండి మీరు నేను చెప్పినట్లు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయండి అని అవని అంటుంది. మొన్న మీ ఆయన అందరికీ సమానంగా ఆస్తి రాయమని చెప్పారు ఇప్పుడు కూడా అదే రాయమంటారా మరి అని లాయర్ అడిగితే కాదండి అక్షయ గారి పేరు మీద అసలు ఒక్క రూపాయి కూడా రాయకుండా మిగతా నలుగురు పేరు మీద సమానంగా ఆస్తి రాయాలని చెప్తుంది అది బయట నుంచి విన్న పల్లవి షాక్ అవుతుంది. సాయంత్రం వచ్చి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తానని చెప్తుంది అవని. ఇక పల్లవి చక్రధర్ ని రమ్మని చెప్తుంది చక్రధరికి ఈ విషయం చెప్పి షాక్ ఇస్తుంది మనము అవనిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తే అది దాన్ని తెలివితో ఇంట్లో వాళ్ళందని తనవైపు మళ్ళించుకునేలా చేస్తుందని పల్లవి అంటుంది.

మొత్తం ఇప్పుడు అందరి పేరుని రాస్తే అది దాని మొగుడు దేవుళ్ళు అయిపోతారని అంటుంది. తనకి చక్రధర్ కన్నింగ్ ప్లాన్ వేస్తాడు.. డాక్యుమెంట్ మార్చి అది వాళ్ళిద్దరి పేరు మీదే మొత్తం ఆస్తి వచ్చేలా రాయిస్తే అవని చెడ్డది అయిపోతుంది ఇంట్లోంచి గెంటేస్తారు ఇంట్లో అందరు ముందు బ్యాడ్ అయిపోతుంది కదా అని చక్రధర్ అంటారు. అయితే మీకు తెలిసిన లాయర్ ని మాట్లాడింది డాడ్ అనేసి పల్లవి అంటే వేరే లాయర్ ఎందుకు అమ్మ అదే లాయర్ ని అడిగి తెలుసుకుందాం డబ్బుకి ఎమ్మడిపోయి లాయర్ అంటూ ఉండరు కదా.. అక్కడికి వెళ్తారు. లాయర్కు డబ్బులు ఇచ్చి వాళ్ళ అనుకున్నట్లుగా డాక్యుమెంట్స్ రాయిస్తారు. ఇక దయాకర్ ఇంటికి రావడంతో రాజేంద్రప్రసాద్ కోపంగా నాలుగు పీకుతాడు. వాళ్లందరికీ నిజం చెప్తానని దయాకర్ అంటే చెప్పుకోబోయే అనేసి అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో అవని రాయించిన డాక్యుమెంట్స్ ప్లేస్ లో పల్లవి రాయించిన డాక్యుమెంట్స్ ని పెడుతుంది మరి ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతాయో రేపు చూడాల్సిందే..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×