BigTV English
Advertisement

CM Chandrababu with PM Modi: బడ్జెట్‌లో ఏపీకి పంట, రాజకీయాలపై కూడా.. పీఎంతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక

CM Chandrababu with PM Modi: బడ్జెట్‌లో ఏపీకి పంట, రాజకీయాలపై కూడా.. పీఎంతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక

CM Chandrababu with PM Modi: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం వెనుక ఏం జరిగింది? రాష్ట్రానికి కావాల్సిన నిధులతోపాటు తాజా రాజకీయాలపై చర్చించారా? రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పంట పండినట్టేనా? సీఎం చంద్రబాబు ప్రస్తావించిన సమస్యలపై కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? అవుననే అంటున్నారు పార్టీల నేతలు.


హస్తినలో బుధవారం రోజంతా బిజీగా గడిపారు సీఎం చంద్రబాబు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే ముఖ్యనేతల భేటీ జరిగింది. దీనికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరై వివిధ అంశాలపై మిత్రులతో చర్చించారు.

ముఖ్యంగా జమిలి ఎన్నికల గురించి కొందరు ఆరా తీశారు. ఈ అంశంపై తొలి అడుగు పడిందని, జేపీసీ వేశామని ఇచ్చిన నివేదిక తర్వాత చర్చిద్దామని అన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలపై నేతలంతా చర్చించినట్టు ఢిల్లీ సమాచారం.


ఎన్డీయే నేతల సమావేశం తర్వాత ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయా మంత్రులతో చర్చించి సహకారం అందించాలని కోరారు. మంత్రుల నుంచి సానుకూలంగా సంకేతాలు వచ్చాయన్నది టీడీపీ నేతల మాట.

ALSO READ: ముహూర్తం ఫిక్స్.. ఆ మంత్రులు ఔట్!

అనంతరం ప్రధాని నరేంద్ర‌మోదీ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. దాదాపు గంటపాటు ఇరువురు వివిధ అంశాలపై చర్చించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానికి నిధులు సమకూర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రధానికి వివరించారు.

విజన్-2047 డాక్యుమెంట్‌ కాపీని ప్రధానికి అందజేశారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం 94 కేంద్ర పథకాల నిధులను దారి మళ్లించిందని విషయాన్ని వివరించారు. వాటిలో 74 పథకాలను పునఃప్రారంభించినట్టు తెలిపారు. ఏపీలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పే విషయం గురించి ప్రధానితో చర్చించారు సీఎం. ఈ ప్లాంట్‌కు అనుమతులతోపాటు ముడిసరకు కేటాయింపులపై చర్చ జరిగింది.

రానున్న రోజుల్లో కొన్ని ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయాన్ని ప్రస్తావించారు. దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఇరువు మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కూటమి సర్కార్‌కు పాజిటివ్ సంకేతాలు ఉన్నాయని వివరించారు. అందుకు సంబంధించి వివరాలను ప్రధాని ముందు పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి రానున్న కేంద్ర బడ్జెట్‌తో నిధుల విషయం ఏపీ పంట పండడం ఖాయమని అంటున్నారు.

Related News

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Big Stories

×