BigTV English
Advertisement

Baby John OTT: ‘బేబి జాన్’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడంటే.?

Baby John OTT: ‘బేబి జాన్’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడంటే.?

Baby John OTT: ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో విడుదలయిన వెంటనే అది ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమ్ అవుతుంది? ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది? లాంటి చర్చలు మొదలవుతున్నాయి. అలాగే తాజాగా విడుదలయిన బాలీవుడ్ మూవీ ‘బేబి జాన్’ విషయంలో కూడా అదే జరుగుతోంది. వరుణ్ ధావన్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘బేబి జాన్’. ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలావరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలే అందుతున్నాయి. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను థియేటర్లలో మిస్ అవుతున్నవారు లేదా థియేటర్లకు ఎందుకులే ఓటీటీలో చూసేద్దాం అనుకునే వారికోసం దీనికి సంబంధించిన ఓటీటీ వివరాలు బయటికొచ్చాయి.


యాక్షన్ రీమేక్

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) వైవిధ్యభరితమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తాడు. అది కమర్షియల్ మూవీ అయినా కాకపోయినా తన యాక్టింగ్‌తో మాత్రం ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తాడు. గత కొన్నేళ్లలో యాక్షన్ కమర్షియల్ చిత్రాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు వరుణ్. అందుకే ‘బేబి జాన్’తో మళ్లీ ట్రాక్‌లోకి రావాలనుకున్నాడు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘తేరీ’ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిందే ‘బేబి జాన్’. ‘తేరీ’లో విజయ్, సమంత, ఎమీ జాక్సన్ హీరోహీరోయిన్లుగా నటించారు. అందుకే ‘బేబి జాన్’లో కూడా సౌత్ హీరోయిన్ అయితే బాగుంటుందని కీర్తి సురేశ్‌ను ఏరికోరి ఎంపిక చేశారు మేకర్స్.


Also Read: బన్నీ ఫ్యాన్స్‌కు షాక్.. ‘పుష్ప 2’ రికార్డులను రెండు రోజుల్లోనే బ్రేక్ చేసిన ‘యూఐ ది మూవీ’

ఓటీటీ రైట్స్

తమిళంలో ‘తేరీ’ సినిమాను అట్లీ డైరెక్ట్ చేశాడు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఆ డైరెక్షన్ బాధ్యతలను ఖలీస్‌కు అప్పగించి తాను నిర్మాతగా సెటిల్ అయ్యాడు. ‘బేబి జాన్’కు నిర్మాతగా అట్లీ.. అసలు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తోంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ సైతం చాలా రిచ్‌గా అనిపిస్తున్నాయని చూసిన ప్రేక్షకులు రివ్యూలు అందిస్తున్నారు. ఇక యాక్షన్ సినిమాలను థియేటర్‌లో చూడడానికి ఇష్టపడనివారు దీనిని ఓటీటీలో చూసేద్దాంలే అని పక్కన పెట్టేశారు. ‘బేబి జాన్’ ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈరోజుల్లో ఒక బాలీవుడ్ సినిమా హిట్ అయినా అవ్వకపోయినా ఓటీటీ రిలీజ్‌కు మాత్రం కనీసం రెండు నెలలు టైమ్ తీసుకుంటున్నారు.

అలాంటి పరిస్థితిలో

ఇతర బాలీవుడ్ చిత్రాలలాగానే ‘బేబి జాన్’ (Baby John) కూడా థియేటర్లలో విడుదలయిన రెండు నెలల తర్వాతే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఒకవేళ థియేటర్లలో పోటీ పెరిగి ఈ సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతే అప్పుడు నెలన్నరలోనే ‘బేబి జాన్’ ఓటీటీ రిలీజ్‌కు ఛాన్స్ ఉందని సమాచారం. ఇక ఈ మూవీలో వరుణ్ ధావన్‌కు జోడీగా కీర్తి సురేశ్‌తో పాటు వామికా గబ్బి కూడా మరొక హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఈ ఇద్దరు హీరోయిన్లు తెగ హైలెట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ క్యామియో కూడా చాలా ప్లస్ అయ్యింది.

Related News

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×