BigTV English

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

AP Govt: ఏపీలో లిక్కర్ వ్యవహారం ముదిరి పాకాన పడిందా? ములకలచెరువు నకిలీ మద్యంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందా? నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందా? నకిలీ మద్యాన్ని ఏరివేసేందుకు కొత్తగా యాప్ తీసుకురావాలని భావిస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


మద్యానికి కొత్తగా యాప్

ములకలచెరువు నకిలీ మద్యం ఏపీలో దుమారం రేపుతోంది. దీనిపై అధికార టీడీపీ-విపక్ష వైసీపీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం అమ్ముతున్నారంటూ వైసీపీ దూకుడు పెంచింది. ప్రతీ నియోజకవర్గంలో నకిలీ లిక్కర్ తయారవుతోందని పదేపదే చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. దీనిపై కూటమి సర్కార్ అలర్ట్ అయ్యింది. వీటికి చెక్ చెప్పాలని డిసైడ్ అయ్యింది.


ఈ క్రమంలో నెల్లూరు టూర్‌లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఎవరు తయారు చేసినా.. విక్రయించినా అదే చివరి రోజు అవుతుందన్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలున్నా అరెస్టు చేస్తామన్నారు. సాధారణ మరణాలు సంభవిస్తే నకిలీ మద్యం తాగి చనిపోయినట్టు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన

ఇదే క్రమంలో కీలక విషయాన్ని బయటపెట్టారు. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలో ప్రభుత్వం ఓ యాప్‌ తీసుకురానున్నట్లు చెప్పారు. మద్యం సీసాపై క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే వివరాలు బయటపడతాయని అన్నారు. ఆ విధంగా యాప్‌ రూపొందిస్తున్నట్లు తేల్చిచెప్పారు.

ALSO READ: విజయవాడ-సింగపూర్ మధ్య కొత్త ఇండిగో విమాన సర్వీసు

మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ టెక్నాలజీ రానుంది. తద్వారా బాటిల్‌లో ఉన్నది మద్యం మంచిదా? కాదా అనేది తేలిపోనుంది. తొలుత ప్రభుత్వం తెచ్చే లిక్కర్ యాప్‌ని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. బాటిల్ కొనుగోలు తర్వాత యాప్ ఓపెన్ చేసి హోలోగ్రామ్ స్టిక్కర్‌ని స్కాన్ చేస్తే చాలు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు యాప్‌లో దర్శనమిస్తాయి. ఒకవేళ అలా కనిపించకుంటే అది నకిలీ మద్యమని తేలిపోతుంది.

సీఎం ప్రకటనపై అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ప్రతీ మందుబాబు వద్ద స్మార్ట్ ఫోన్ ఉండాలి? పల్లెటూర్లలో చాలామందికి ఫోన్‌లో మాట్లాడుతారు కానీ, స్మార్ట్ ఫోన్‌పై పూర్తిగా అవగాహన లేదు. యాప్ వచ్చిన తర్వాత నకిలీ మద్యానికి చెక్ పడుతుందా? అన్నది అసలు పాయింట్.

రేపటిరోజున నకిలీ మద్యం తయారీదారులు ఆ తరహాలో యాప్‌ని తీసుకొచ్చే అవకాశముందని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎవరెవరు నకిలీ మద్యం తయారు చేశారో వారికి కఠిన శిక్షలు పడితే కొంతవరకు కంట్రోల్ చేయవచ్చని అంటున్నారు. మద్యం తాగితే కిక్ ఏమోగానీ మందుబాబుల్లో తాము మంచిది తీసుకుంటున్నామా? లేదా అన్న డౌట్ అప్పుడే మొదలైంది.

Related News

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Big Stories

×