BigTV English

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీస్‌ను ఇండిగో సంస్థ ప్రారంభించనుంది. ఈ సేవను విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలకమైన పాత్ర పోషించారు. తాజాగా ఈ సర్వీసుకు సంబంధించి వివరాలను రామ్మోహన్ నాయుడు మీడియాకు తెలిపారు.


విజయవాడ నుండి వారానికి మూడు సార్లు మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉండనుందని.. ఈ నవంబర్ 15 నుంచి ఈ ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నుండి సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయాల మధ్య నేరుగా వారానికి మూడు సార్లు ఈ విమాన సర్వీసు స్థానికులకు సేవలందించనుంది.

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో

జులై 28,2025న సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సమయంలో ప్రస్తావన వచ్చినట్టు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు.. వందరోజులోనే సర్వీసును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047లో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమైనదని రామ్మోహన్ నాయుడు తెలిపారు. భవిష్యత్ లో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణాలు జరిపే అవకాశం ఉండటంతో ఇంటర్నేషనల్ కనెక్టివిటీని మరింత విస్తృతం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.


రామ్మోహన్ నాయుడు చొరవ

ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నారు. పౌర విమానయాన అభివృద్ధిలో విప్లవాత్మక ముందడుగుగా విజయవాడ వాసులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు ఈ సర్వీసు పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల అభ్యర్థన, ఆలోచన మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో నూతన విమాన సర్వీసు ఏర్పాటుకు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నారు.

ఈ సర్వీస్ కేవలం విజయవాడకే కాకుండా, రాష్ట్ర ప్రజలకు కూడా వరంగా మారనుంది. సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరానికి ప్రత్యక్ష కనెక్షన్ లభించడంతో విజయవాడ – గుంటూరు ప్రాంతాల విద్యార్థులకు, పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు, పర్యాటకులకు నూతన అవకాశాలు ఏర్పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమరావతికి అంతర్జాతీయ కనెక్టివిటీ

సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మరింత లాభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగావకాశాల కోసం, ఉన్నత విద్య కోసం అంతర్జాతీయంగా ప్రయాణించే యువతకి ఇది గొప్ప వారధిగా మారనుంది.

Also Read: SCR Train Timings: రైల్వే ప్రయాణికుల అలర్ట్.. ఈ రైళ్ల టైమింగ్స్ మారాయి.. కొత్త షెడ్యూల్ ఇవే

విజయవాడ నుండి మల్టిపుల్ టైమింగ్స్‌తో ప్రయోజనం పొందేలా ఇండిగో సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ టైమింగ్స్‌ను రూపొందించడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ అభివృద్ధి సాధించేందుకు ఈ విమాన సర్వీసు దోహదపడుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ రూట్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

Big Stories

×