Lulu Mall: అంధ్రప్రదేశ్ లో లులూ గ్రూప్ కు భూ కేటాయింపులు, రాయితీల విషయంలో మంత్రి వర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లులూ సంస్థ విధానాలపై, వారికి ఇచ్చే రాయితీలు, ఉద్యోగాలపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. లులూ సంస్థ ‘రాష్ట్రానికి నేనే అవసరమన్న’ ధోరణిలో వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై ముఖ్యమంత్త్రి చంద్రబాబు నాయుడు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
విజయవాడ సమీపంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో లులూ గ్రూప్ కు చెందిన మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్‌ఫోర్ట్సుకు 7.8 ఎకరాల భూమిని ఇచ్చే ప్రతిపాదనపై ఏపీ కేబినెట్‌లో తీవ్ర చర్చ జరిగింది. కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లులూ ముందుకు వచ్చిందని అధికారులు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్ లులూ వ్యవహార శైలిపై సీరియస్ అయినట్టు తెలస్తోంది.
ALSO READ: Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?
లులూ తీసుకునే ల్యాండ్ లో ఆహార శుద్ధి అంటే ఏమిటి..? కూరగాయలు, పండ్లు ప్రాసెస్ చేస్తారా..? ఉద్యాన వన పంటలు సాగు చేస్తారా..? లేదా గోవధ చేసి మాంసం ఎగుమతి చేస్తారా..? అని పలు ప్రశ్నలను లేవనెత్తారు. అసలు గోవధ జరగడానికి వీలు లేదని.. దానికి తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు.
ALSO READ: Gold Capital of India: భారతదేశ గోల్డ్ రాజధాని ఏదో తెలుసా..? ఇక్కడ నుంచి భారీగా బంగారం ఉత్పత్తి..
అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సీఎం చంద్రబాబుబు నాయుడు జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర పరిధిలో గోవధ జరగడానికి అసలు వీలు లేదని అన్నారు. కేవలం మామిడి, బొప్పాయి వంటి పండ్ల సాగుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా.. లులూ గ్రూప్ ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని తిరిగి మళ్లీ ప్రభుత్వానికే షరతులు విధించడంపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
లీజు మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా 5 ఏళ్లకు 5 శాతం మాత్రమే పెంచడాన్ని, అలాగే లీజు పెంపును 3 ఏళ్లకు కాకుండా పదేళ్లకు ఓసారి మాత్రమే చేస్తామనడం పై మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలకు కల్పించాలనే నిబంధన కచ్చితంగా ఉండాలని పవన్ కల్యాణ్ పట్టుబట్టారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని, ప్రజలకు మేలు చేసే నిర్ణయమే తీసుకోవాలని ప్రతిపాదించడంతో చర్చ ముగిసింది.