CM Chandrababu: అమరావతిలో తొలి సీఆర్డీఏ భవనం మొదలైందన్నారు సీఎం చంద్రబాబు. రేపటి రోజున ప్రభుత్వం, ప్రైవేటు భవనాలు ఒకొక్కటిగా మొదలవుతాయని అన్నారు. గడిచిన ఐదేళ్లు రైతులు పడిన కష్టాలు చూశామని, ఆడబిడ్డలు రోడ్డెక్కి పోరాటం చేశారన్నారు. ఆనాడు అనేక ఉద్యమాలు చేశారని, అండగా ఉండేందుకు జోలిపట్టి దాని ద్వారా వచ్చిన డబ్బులను ఉద్యమానికి ఇచ్చామని గుర్తు చేశారు.
అమరావతిలో సీఆర్డీయే భవనం ప్రారంభం
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిని కట్టాలని ఆనాడే నిర్ణయించామన్నారు. ఈ రోజు ఉండటానికి మంచి బిల్డింగులు కావాలంటే రేకుల షెడ్లు వేస్తున్నారని వైసీపీ నేతలు అపహాస్యం చేశారన్నారు. సోమవారం సీఆర్డీఏ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఆ ప్రాంత రైతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎ చంద్రబాబు వారిని ఉద్దేశించిన మాట్లాడారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పడిన కష్టాలను వివరించారు. రాజధాని అమరావతిపై రకరకాలుగా విషం చిమ్మారని అన్నారు. చివరకు వేశ్యల ప్రాంతమని మాట్లాడారని గుర్తు చేశారు. కొందరేమో శ్మశానం అని, ఇంకొందరు ఏడారంటూ మాట్లాడారన్నారు.
అమరావతిపై విషం చిమ్మారు
దేశంలో ఇంత మంచి ప్రాంతం ఎక్కడా లేదన్నారు. రేపటి రోజున ఏపీలో నదులు అనుసంధానం అయితే ఇక్కడి నుంచి నీళ్లు వెళ్తాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని సిటీ అమరావతి అవుతుందన్నారు. బంగారం పండించే ప్రాంతమని, గ్రీనరీకి కొరత ఉండదన్నారు.
ఆనాడు హైటెక్ సిటీని నిర్మించినప్పుడు విజన్ గురించి చెబితే చాలామంది అవహేళన చేశారన్నారు. ఆనాడు ఎయిర్ పోర్టుకు భూములు ఇవ్వాలని కోరితే వెంటనే ఇచ్చారని, వాటి పక్కన కొన్నవారు బ్రహ్మాండంగా బాగుపడ్డారని గుర్తు చేశారు. తొలిసారి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన ఘటన అమరావతి రైతులకే చెందుతుందన్నారు.
ALSO READ: సీఆర్డీయే కొత్త భవనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తనను విమర్శించేవారికి ఒక్కటే మాట చెబుతున్నారని, ప్రభుత్వం తరపు నుంచి రాజధాని అమరావతి కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయడం లేదన్నారు. హైదరాబాద్ నగరం వల్ల 70 శాతం ఆదాయం అక్కడి నుంచే వస్తుందన్నారు. రాయదుర్గ్‌లో అప్పుడు ఎకరా లక్ష రూపాయలు ఉంటే.. మొన్నటికి మొన్న 177 కోట్లకు వెళ్లిందన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ క్వాంటమ్ మిషన్ పెట్టారని, తాను క్వాంటమ్ కంప్యూటర్‌ని అమరావతికి తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు. ఆయన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తీసుకొస్తే..ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్ గురించి మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. శాశ్వతంగా ఎన్డీయే ప్రభుత్వం ఉండాలన్నారు.
టీడీపీ-జనసేన-బీజేపీలు కలిసి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇకపై నుంచి అమరావతి రైతులు.. పారిశ్రామికవేత్తలుగా మారాలన్నారు. విశాఖపట్నం అమరావతి కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోకి వచ్చిన అదిపెద్ద ఇన్వెస్టుమెంట్ గూగుల్‌దేనన్నారు. ఇంకా చాలా కంపెనీలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. అమరావతి స్థలం బాగుందని, నిర్మాణం గట్టిగా వేశామన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణం ఎలా జరగాలో ఆలోచించాం.. అప్పుడు కావాల్సిన జాగా కూడా లేదు.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు
– సీఎం చంద్రబాబు pic.twitter.com/ko9FuNZBVf
— BIG TV Breaking News (@bigtvtelugu) October 13, 2025