E-Paper
Advertisement

CM Chandrababu On Tirumala Ghee Case: కల్తీ నెయ్యి ఇష్యూ.. వైసీపీని ఏకేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu On Tirumala Ghee Case: కల్తీ నెయ్యి ఇష్యూ.. వైసీపీని ఏకేసిన సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu On Tirumala Ghee Case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కేవలం లడ్డూ విషయంలోనే కాదని, అనేక విషయాల్లో గత వైసీపీ పాలకులు తప్పులు చేశారన్నారు సీఎం చంద్రబాబు. కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు 59.71లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందన్నారు.

కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీ చర్చ

Advertisement

మంగళవారం ఏపీ అసెంబ్లీలో తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ చర్చలో అన్ని పార్టీల సభ్యులు పాల్గొని తమతమ వాయిస్ వినిపించారు. సీఎం చంద్రబాబాబు ప్రసంగంచారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు రూ. 234.51 కోట్ల నిధులు అక్రమాలు జరిగాయని వివరించారు. దీనిపై ఎ టు జెడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

గతంలో టీటీడీ చైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కల్తీ జరిగిందని చెప్పారని, పార్టీ అధ్యక్షుడిగా జగన్ క్షమాపణలు చెప్పాల్సిందిపోయి, ఏమీ తెలియదన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. 2019-24 మధ్యకాలంలో దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో చేశారన్నారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారన్నారు.

Advertisement

టీటీడీ ప్రక్షాళన కోసం ఈవోను నామినేట్ చేశామన్నారు. ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదికను తాను ప్రస్తావించారని తెలియజేశారు ముఖ్యమంత్రి. తనకు ఏ కష్టమొచ్చినా వెంకన్న స్వామికి చెప్పుకుంటామన్నారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు సిట్ వేయాలని ఆలోచించామన్నారు. సిట్ వేస్తే దానిపైనా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారన్నారు.

సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. వైసీపీని ఏకేశారు

రాజకీయ వివాదం ఉండకూడదనే రాష్ట్ర-కేంద్రప్రభుత్వ అధికారులతో సిట్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చేసిన తప్పులపై చర్యలు తీసుకోవాలని సిబీఐ రిపోర్టు పంపించిందన్నారు సీఎం చంద్రబాబు. టీటీడీ కూడా కొన్ని మార్పులు చేయాలని సూచిస్తే ఆ రిపోర్టును టీటీడీకి పంపించామన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పినందున ఏకసభ్య కమిటీ ఏర్పాటుకు ముందుకెళ్లామన్నారు.

సీబీఐ రిపోర్టు, ఫోరెన్సిక్ ఆధారాలను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు సీఎం. 2020 జనవరి, ఫిబ్రవరిలో టెండర్ల నిబంధనలను మార్చి, నాణ్యతా ప్రమాణాలకు తలోదకాలు ఇచ్చారని వివరించారు. 2022 ఆగష్టులో బీటా సిటోస్టిరాల్ తో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందన్నారు. సీఎఫ్‌టీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు వస్తే తొక్కి పెట్టారని తెలియజేశారు.

లడ్డూలో జంతు కొవ్వు కలసిందని తాను సొంతంగా చెప్పలేదని, ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టుని తాను చెప్పానన్నారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చారని, ఒక పద్దతి ప్రకారం లాలూచీ పడి చేసిన లూఠీ అని స్పష్టంగా తేలిందన్నారు. వీటిపై ఆనాడు చర్యలు తీసుకుంటే అన్నీ సరిగా జరిగేవని చెప్పారు.

ALSO READ: కల్తీ నెయ్యి.. కల్తీ పాలు.. ఏదైనా సర్కారు వైఫల్యమేనా?

అదే సమయంలో హెరిటేజ్ గురించి క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రాజకీయాల్లో ఉండడంతో కొన్ని నిబంధనలు పెట్టుకున్నామన్నారు. ఆలయాలకు హెరిటేజ్ పాలు, నెయ్యి సరఫరా చేయకూడదని ఆనాడే నిర్ణయం తీసుకున్నామని మనసులోని మాట బయటపెట్టారు ముఖ్యమంత్రి. హెరిటేజ్ ఏనాడూ తప్పు చేయదు.. చేయలేదన్నారు. సాక్షికి వందల కోట్ల అడ్వటైజ్‌మెంట్ ఇచ్చారని, వాటి గురించి మాట్లాడటం లేదన్నారు.

భారతి సిమెంట్‌ని ప్రభుత్వానికి సంబంధించి అన్నింటికి ఇచ్చారని, దాని గురించి తామేమీ మాట్లాడలేదన్నారు. నేరస్తులు ఏ విధంగా దెబ్బ తీస్తారని చెప్పడానికి ఇదో ఉదాహరణగా చెప్పారు. తిరుమలలో జరిగింది నెయ్యి కల్తీ అని, ఏ విధంగా ముడిపెట్టాలని భావించి బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు.

అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో టీటీడీ ఏడుకొండలు కాదని, రెండు కొండలని జీవో ఇచ్చారని వివరించారు. దానికి సంబంధించి కాపీలను బయటపెట్టారు. దీనిపై అసెంబ్లీలో పోరాటం చేశామని, రెండేళ్ల తర్వాత ఆ జీవోపై అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. బ్రిటీషర్స్ తలపెట్టని ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×