BigTV English

AP: ఏపీ ఘనతను గడగడా చెప్పేసిన సీఎం జగన్.. ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ స్పెషల్..

AP: ఏపీ ఘనతను గడగడా చెప్పేసిన సీఎం జగన్.. ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ స్పెషల్..

AP: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను అట్టహాసంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. 2 లక్షల కోట్ల పెట్టుబడులను టార్గెట్‌గా పెట్టుకుంది. సమ్మిట్ కోసం ఇప్పటికే 12 వేలకు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. 35 మంది దేశీయ టాప్ ఇండస్ట్రియలిస్టులతో పాటు 25 దేశాలకు చెందిన దిగ్గజ వ్యాపారులు, హైకమిషనర్లు సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ముఖేష్ అంబానీ, అదానీ, ఆదిత్య బిర్లా, మిట్టల్ వంటి వారితో పాటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డిలు కూడా విచ్చేయనున్నారు. విశాఖ జీఐఎస్‌ నేపథ్యంలో జాతీయ మీడియాకు సీఎం జగన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీలో ఉన్న వనరులు, పెట్టుబడి మార్గాలు, అభివృద్ధి అంశాలపై విస్తృత సమాచారం అందించారు. సీఎం జగన్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే….


–ఏపీకి 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం. 6 పోర్టులు, కొత్తగా ఏర్పాటవుతున్న మరో 4 పోర్టులు. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అత్యంత అనుకూలం.

–దేశంలో 11 పారిశ్రామిక కారిడార్‌లు వస్తుంటే.. అందులో 3 ఏపీకే. మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే.


–రాష్ట్రంలో 48 రకాల ఖనిజాలు లభ్యత.. సిమెంట్, లైమ్‌స్టోన్‌ పరిశ్రమలకు అనుకూలం.

–రెన్యువబుల్, గ్రీన్‌ ఎనర్జీకి ఏపీలో పుష్కలమైన వనరులు. విండ్, హైడ్రోజన్, సోలార్‌ విద్యుదుత్పత్తికి అపార అవకాశాలు. 82 గిగావాట్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ కెపాసిటీ, 34 గిగావాట్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు అవకాశం.

–2021–22లో 11.43 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ మొదటి స్థానం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నెంబర్‌ వన్.

–ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక చర్యలు. ‘నాడు–నేడు’, ‘అమ్మ ఒడి’.. ఓ విప్లవం.

–ఆరో తరగతి నుంచి డిజిటల్‌ తరగతులు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు.

–ఏపీలో అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథకాలు కాదు.. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా భావి­స్తున్నాం.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×