BigTV English

100 Crore Worth Seized in AP : కోడ్ కూత నుంచి.. ఏపీలో బంగారమే బంగారం.. 100 కోట్ల వరకు సీజ్..!

100 Crore Worth Seized in AP : కోడ్ కూత నుంచి.. ఏపీలో బంగారమే బంగారం.. 100 కోట్ల వరకు సీజ్..!

100 crore worth Seized in AP During the Election Code: ఎన్నికల వేళ ఏపీలో ధన ప్రవాహం జోరందుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టి చర్యలు చేపట్టినప్పటికీ డబ్బు, బంగారం, లిక్కర్ ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్వ్కాడ్, సీ విజల్ యాప్ అనేక రకాలుగా చర్యలు చేపడుతోంది ఎన్నికల సంఘం. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 100 కోట్ల మేరా సీజ్ చేసినట్టు చెప్పుకొచ్చారు ఏపీ ఈసీ ముకేష్‌కుమార్ మీనా. ఇందులో అగ్రభాగం బంగారమేనట.


మొత్తం స్వాధీనం చేసుకున్నవాటిలో 25 కోట్ల రూపాయల నగదు, పన్నెండున్నర కోట్ల విలువ చేసే లిక్కర్, రెండు కోట్ల డ్రగ్స్, 62 కోట్ల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలున్నాయి. ఈ విషయాన్ని ముకేష్‌కుమార్ మీనా స్వయంగా వెల్లడించారు. నోటిఫికేషన్ మొదలు పోలింగ్ వరకు ఇప్పటికంటే రెట్టింపు నగదు, నగలు పట్టుబడే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించడానికి అన్ని గోదాముల వద్ద సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముకేష్‌కుమార్ మీనా. గోదాముల నుంచి మద్యం తరలించే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం ప్రక్రియ ఈనెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్నికల స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన ఎన్నికల అధికారి మీనా, గుండ్లాపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించారు. తగిన ఆధారాలు లేకుండా డబ్బు పట్టుబడితే ట్రైజరీకి అప్పగించాలని అధికారులకు సూచించారు.


Also Read: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..

ఇదిలావుండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. బీవీసీ లాజిస్టిక్స్‌కు సంబంధించిన వాహనాల్లో ఐదు కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. ఎనిమిది కేజీల బంగారం, 46 కేజీల వెండిని రాత్రి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాకినాడ నుంచి విశాఖకు వెళ్తున్న వాహనాన్ని పెద్దాపురం వద్ద ఆపి తనిఖీలు చేశారు.

మూడురోజుల కిందట కూడా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కలపర్రు టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు అధికారులు. అందులో 16 కేజీల బంగారం, 30 కేజీల వెండి ఉంది. మొత్తానికి ఎన్నికల వేళ ఏపీలో భారీగా బంగారం పట్టుబడుతోంది.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×