E-Paper
Advertisement

Jagan : చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం భూమిపూజ.. బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: జగన్

Jagan :  చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం భూమిపూజ.. బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: జగన్
Advertisement

Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ వద్ద అమూల్‌ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. చీలాపల్లిలో 300 పడకల మెడికల్‌ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

హెరిటేజ్‌ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని సీఎం మండిపడ్డారు. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని ఆరోపించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే మోసం చేశారని ఆరోపించారు. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉన్న సమయంలో హెరిటేజ్‌ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసిందని అన్నారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్‌ చేస్తున్నామన్నారు. అమూల్‌ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలిపారు.

Advertisement

చంద్రగిరిలో గెలవలేమని కుప్పం వలస వెళ్లారని చంద్రబాబుపై జగన్ విమర్శించారు. ఇప్పుడు కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారని తెలిపారు. దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ కల్యాణ్ ప్యాకేజీ శూరుడు అని జగన్ సెటైర్లు వేశారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.

10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 150 కోట్లతో దేశంలో అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్ నిర్మిస్తారు. దశలవారీగా పాల కర్మాగారం, బటర్, పాలపొడి, చీజ్, పన్నీర్, స్వీట్ల తయారీ విభాగాలను ఏర్పాటు చేస్తారు. ఈ డెయిరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 5 వేలమందికి, పరోక్షంగా 2 లక్షల మంది ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం తెలిపింది. 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పింది.

Advertisement

Related News

పార్టీ కేడర్‌కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్.. రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు

DSC జూడో సర్టిఫికెట్ల వివాదంపై.. క్లారిటీ ఇచ్చిన ఎండీ భరణి!

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

Big Stories

Advertisement
×