BigTV English

US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..

US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..

US : అమెరికాలో భారత్ దౌత్య కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. శాన్‌ ఫ్రాన్సిస్‌కోలోని ఇండియన్ కాన్సులేట్‌ కు దుండగులు నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. 5 నెలల వ్యవధిలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. మార్చిలో ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు.


దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ‍అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిని అమెరికా ఖండించింది. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మార్చిలో భారత్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్‌ పాల్ సింగ్‌ ను పట్టుకునేందుకు కేంద్రం వేట కొనసాగించింది. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్‌ఫ్రాన్సిస్‌కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అమృత్‌పాల్‌ సింగ్‌ను వదిలేయాలని నినాదాలు చేశారు. ఇప్పుడు రెండోసారి దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×