BigTV English

YS Sharmila: షర్మిలనా.. మజాకా.. ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇంటర్వ్యూలు..

YS Sharmila: షర్మిలనా.. మజాకా.. ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇంటర్వ్యూలు..

YS Sharmila latest news


YS Sharmila latest news(AP assembly elections 2024 updates): ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా సిద్దమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ఎన్నికల పోరాటానికి తాము సైతం అంటూ సిద్దమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త ఉత్సాహంతో ఆ పార్టీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది.

గెలిచే వ్యక్తులకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం పక్కా వ్యూహంతో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను షర్మిలకు అప్పగించింది. ఏపీ ఎన్నికలకు వైసీపీ, టీడీపీ జనసేన కూటమి సర్వేల ఆధారంగా ప్రజాక్షేత్రంలో అభ్యర్థులకు ఉన్న మద్దతు ఆధారంగా, వారి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా టికెట్లు కేటాయిస్తును్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో కొత్త విధానాన్ని అవలంబిస్తోంది.


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టికెట్ ఆశిస్తున్న ఆశావహులను ఇంటర్వ్యూలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పక్కా కార్పోరేట్ స్లైల్లో వైఎస్ షర్మిల ఇంటర్య్వూలు నిర్వహిస్తుండడంతో అటు పార్టీ శ్రేణులలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పటికే వివిధ నియోజకవర్గాలలో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థుల ఎంపికకు ఇంటర్వూలు నిర్వహిస్తోంది.

Read More:  వైసీపీ 8వ లిస్ట్.. 2 ఎంపీ, 3 ఎమ్మెల్యే ఇన్‌ఛార్జ్‌ల ప్రకటన

ఆంధ్రరత్న భవన్ వేదికంగా నిన్న మొదలైన ఇంటర్వ్యూలు, నేడు కూడా కొనసాగుతున్నాయి. గురువారం నరసాపురం, నరసరావుపేట, మచిలీపట్నం, బాపట్ల, ఏలూరు, గుంటూరు లోక్ సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు టికెట్లను ఆశిస్తున్న ఆశావహులకు వైఎస్ షర్మిల ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిన్న రాత్రి వరకు వీరిని ఇంటర్వ్యూ చేశారు వైఎస్ షర్మిల.

నేడు శ్రీకాకుళం, అరకు, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆశావహులతో వైఎస్ షర్మిల పేరుగా మాట్లాడుతున్నారు. అభ్యర్థుల స్థతిగతులు, వారికి ప్రజలలో ఉన్న మంచి పేరు, అభ్యర్థుల గుణగణాలు, పార్టీ పట్ల వారికున్న కమిట్మెంట్ ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వైఎస్ షర్మిల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×