BigTV English

CM Revanth Reddy: అరుదైన గౌరవం.. ఆ జాబితాలో జగన్ కంటే సీఎం రేవంతే పవర్ ఫుల్..

CM Revanth Reddy: అరుదైన గౌరవం.. ఆ జాబితాలో జగన్ కంటే సీఎం రేవంతే పవర్ ఫుల్..

CM Revanth reddy latest news


CM Revanth reddy latest news(Political news in telangana): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకుని.. అనతికాలంలోనే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేషనల్ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ దేశంలోని వంద మంది మోస్ట్ పవన్ ఫుల్ ఇండియన్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఉండడం విశేషం.

అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో మొదటి 5 స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హో మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, కేంద్ర మంత్రి జయశంకర్ లు ఉన్నారు.


అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 39వ స్థానంలో ఉండగా ఏపీ సీఎం జగన్ మాత్రం 56వ స్థానంలో ఉన్నారు. అయితే సీఎం జగన్ కంటే రేవంత్ రెడ్డి 15 స్థానాల ముందు ఉండడం గమనార్హం .

ఇదిలా ఉంటే కింగ్ కోహ్లీ 38వ స్థానంలో ఉంటే రేవంత్ రెడ్డి ఒక్క స్థానం వెనుక ఉన్నారు. మరో వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 16 స్థానంలో ఉన్నారు. సోనియా గాంధీ 19వ స్థానం, మల్లిఖార్జన ఖర్గే 36వ స్థానం, ప్రియాంక గాంధీ 62వ స్థానంలో ఉన్నారు. మమతా బెనర్జీ.. రాహుల్ గాంధీ కంటే ఒక స్థానం ముందు అంటే 15వ స్థానంలో ఉన్నారు.

Read More: ధరణి ధరఖాస్తులకు మోక్షం..! మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్..

మరో వైపు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పదోస్థానంలో ఉన్నారు. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. నితూ అంబానీ 26వ స్థానంలో ఉన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా 43వ స్థానంలో ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ 17వ స్థానంలో ఉన్నారు. ఇక మహేంద్ర సింగ్ దోని 58వ స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 68వ స్థానం, అసదుద్దీన్ ఓవైసీ 78, అలియా భట్ 79, దీపికా పదుకొణ్ 87, అమితాబ్ బచ్చన్ 99వ స్థానంలో ఉండగా 100వ స్థానంలో రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఉన్నారు.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×