BigTV English

CPI Narayana: బ్రాందీ షాపుకు వెళ్లిన సీపీఐ నారాయణ.. అసలు ఇలా చేస్తారని మీరు ఊహించరు కూడా..

CPI Narayana: బ్రాందీ షాపుకు వెళ్లిన సీపీఐ నారాయణ.. అసలు ఇలా చేస్తారని మీరు ఊహించరు కూడా..

CPI Narayana: సీపీఐ నారాయణ ఏమి చేసినా అందులో కొత్తదనం ఉండాల్సిందే. నిరసన తెలిపినా కూడా అదొక వెరైటీ ఉండాల్సిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకాలపై ఏకంగా తన పొలంలో కూర్చొని, మా పాస్ పుస్తకాలపై మీ బొమ్మలు ఎందుకంటూ గట్టిగా ప్రశ్నించారు. అలాగే తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోకి అదేపనిగా వెళ్లి, అక్కడి రహదారులు చూడండి.. మన రహదారులు చూడండి అంటూ వీడియోలను కూడా వదిలారు. అలా సీపీఐ నారాయణ ఏది చేసినా వైరల్ కావాల్సిందే.


ఈసారి ఆయన కన్ను మద్యంసీసాలపై పడింది. అదేదో మద్యం త్రాగేందుకు మాత్రం కాదండోయ్. జస్ట్ అలా రుచి చూడడానికి కూడా కాదు. ఏపీలో నూతన మద్యం విధానం అమలులోకి వచ్చిన సంధర్భంగా అసలు రేట్లు ఎలా ఉన్నాయి ? మద్యం టేస్ట్ మారిందా లేదా.. అనే విషయాలు తెలుసుకొనే ప్రయత్నం చేశారు సీపీఐ నారాయణ. అందుకోసం ఏకంగా మద్యం షాపుకు వెళ్లారు.. మందుబాబులతో మాట్లాడారు.

ఏపీలో నూతనంగా మద్యం షాపుల లైసెన్స్ లను దక్కించుకున్న యజమానులు 16వతేదీ నుండి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. అయితే ఏపీ కూటమి అధికారంలోకి రాక ముందు తాము బ్రాండెడ్ మద్యంను మందుబాబులకు అందిస్తామని, అలాగే ధరలు కూడా తగ్గిస్తామని ప్రకటించింది. ఇప్పుడు అధికారం చేజిక్కించుకొని నూతన మద్యం విధానం అమల్లోకి రాగా.. అసలు మద్యంపై మందుబాబుల అభిప్రాయం ఎలా ఉంది? ధరల్లో మార్పు ఉందా ? బ్రాండెడ్ మద్యం దొరుకుతుందా లేదా అనే అంశాలు తెలుసుకొనేందుకు సీపీఐ నారాయణ కృష్ణాజిల్లా గన్నవరం మండలం దుర్గాపురంలోని ఓ వైన్ షాప్ వద్దకు వెళ్లారు.


అక్కడ ధరల గురించి వాకబు చేయగా.. స్వల్పంగా మార్పు ఉందని, అలాగే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా చాలా స్వేచ్చగా మద్యం దొరుకుతుందంటూ మందుబాబులు తెలిపారు. బ్రాండెడ్ ఏది కావాలన్నా అందుబాటులో ఉందని మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక వారి నుండి పక్కకు చేరుకున్న నారాయణ మాట్లాడుతూ.. మద్యం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ మద్యంలో మంచి, చెడు అనేవి కూడా ఉంటాయా అంటూ ప్రశ్నించారు. మద్యాన్ని ఆదాయవనరుగా ప్రభుత్వం భావించి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చిందని, ధరల్లో కూడా అంతగా మార్పు లేదన్నారు. పాతసీసాలో కొత్త మందు చేరిందని తనదైన శైలిలో నారాయణ సెటైర్ వేశారు.

Also Read: Joy Jemima Honey Trap Case: అసలు ఎవరు ఈ జాయ్ జెమిమా? ఆమె ఉచ్చులో పడే మగాళ్లను ఏం చేస్తోంది?

ఒక్కసారిగా సిపిఐ నాయకులు మద్యం షాప్ వద్దకు రాగా… అసలు ఏమి జరుగుతుందంటూ మందుబాబులు చర్చించుకున్నారు. మద్యం అలవాటు లేని నారాయణ, డైరెక్ట్ గా వైన్ షాప్ వద్దకు వెళ్లడం, అక్కడ మద్యం బాటిల్ పట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×