E-Paper
Advertisement

అర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో పాఠశాలలకు సెలవులు, విద్యుత్ ఉద్యోగుల సెలవులు క్యాన్సిల్

అర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో పాఠశాలలకు సెలవులు, విద్యుత్ ఉద్యోగుల సెలవులు క్యాన్సిల్
Advertisement

Cyclone Arnab: అర్నబ్ తుఫాను ప్రచండ వేగంతో ఏపీ తీరం వైపు దూసుకువస్తోంది. బుధవారం మధ్యాహ్నం బాపట్ల-విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో పాఠశాలలకు రెండురోజులపాటు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. మరోవైపు విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.

తుఫాన్‌తో ఏపీలో పాఠశాలలకు సెలవులు

అర్నబ్ తుఫాన్ ఏపీని వణికిస్తోంది. తీర ప్రాంతాలపై విరుచుకుపడుతున్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం అలర్టయ్యింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితి గమనించిన విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుస్తు జాగ్రత్త చర్యల్లో పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Advertisement

తుఫాను ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో వివిధ జిల్లాల అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అందులో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పాఠశాలు, కాలేజీలు ఉన్నాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం విద్యాసంస్థల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది.

విద్యుత్ ఉద్యోగుల సెలవులు క్యాన్సిల్

మరోవైపు అర్నబ్ తుఫాన్‌ వార్నింగ్ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది ఆ శాఖ. ఈ విపత్తుపై APCPDCL సీఎండీ పుల్లారెడ్డి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

Advertisement

తుఫాన్‌ కారణంగా భారీ గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సామగ్రిని రెడీ ఉంచాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచన చేశారు.

ALSO READ: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. అలర్టయిన రైల్వే శాఖ, 53 రైళ్లు రద్దు!

Related News

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. అలర్టయిన రైల్వే శాఖ, 53 రైళ్లు రద్దు!

వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం

ప్రజాక్షేత్రంలో గెలవాలి కానీ.. ఇలా దోపిడీ చేయడం ఏంటి?: అనిల్ కుమార్ యాదవ్

కర్నూలులో హైడ్రామా.. తొడ కొట్టి, మీసం తిప్పి టీడీపీకి హఫీజ్ ఖాన్ సవాల్!

ఇంజనీర్ లలిత కుమారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అందుకే చంపేసాడా..?

విశాఖ రేంజ్ మారబోతోంది.. తూర్పు తీరంలో ఇక శాన్‌ఫ్రాన్సిస్కో మ్యాజిక్!

టీడీపీ ఏకగ్రీవాలపై విజయసాయి కామెంట్స్.. ఇవేమీ నిజమైన పరీక్ష కావు, 2029 ఎన్నికలే అసలైన

Big Stories

Advertisement
×