Karthika Deepam 2 serial today Episode: సూరజ్ కంటిన్యూగా జ్యోత్స్నకు ఫోన్ చేస్తుంటే.. జ్యోత్స్న రూంలోకి వెళ్లి లిఫ్ట్ చేసి మమ్మల్ని రాత్రి పూట కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ తిడుతుంది. మీ తాత అమ్మ వచ్చి గొడవ చేశారు అంటుంది. అందుకు సూరజ్ గొడవ మొదలు పెట్టిందే నువ్వు ఆ పోలీస్‌కు మా అమ్మ పేరు చెప్పావు అది అడగడానికే మా తాతయ్య, అమ్మ వచ్చారని చెప్తాడు సూరజ్. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కంటిన్యూగా జ్యోత్స్న తిడుతూనే ఉంటుంది. అయితే సూరజ్ నీతో మాట్లాడాలి బయటకు రా అంటాడు సూరజ్. ఏంటి ఏదో పెళ్లాన్ని బెదిరించినట్టు బెదిరిస్తున్నావేంటి..? అంటూ తిడుతుంది. తాను బయటకు రానని చెప్తుంది. అయితే సూరజే ఇంటికి వస్తానంటాడు.. ఎక్కడికి రావాలని జ్యోత్స్న అడుగుతుంది. సూరజ్ లోకేషన్ చెప్తాడు.
జ్యోత్స్న వెళ్తుంది. సూరజ్ ఎమషనల్‌గా చూస్తుంటాడు. జ్యోత్స్న హాయ్ సార్ అంటే సార్ ఎందుకులే మామూలుగానే పిలువు లైక్ ఫ్రెండ్స్ అంటే చెప్పరా ఈ టైంలో ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా అంటుంది. సారే బెటర్ అదే కంటిన్యూ చేయ్ అంటాడు సూరజ్. నేను రమ్మనగానే ఎందుకు వచ్చావు అని సూరజ్ అడిగితే.. సరే పోతానులే అంటూ జ్యోత్స్న వెళ్లబోతుంటే చేయి పట్టుకుంటాడు సూరజ్. జ్యోత్స్న షాకింగ్‌గా చూస్తుంటే.. చేయి వదిలేస్తూ సూరజ్ సారీ చెప్తాడు. ఎందుకు సారీ పట్టుకున్నందుకా.. వదిలేసినందుకా అని అడుగుతుంది.
మొదటి దానికే సారీ అంటాడు సూరజ్ రెండో దానికి కూడా త్వరలోనే చెప్తావులే సారీ అంటుంది జ్యోత్స్న. ఆఫీసులో పేపర్స్ విసిరేశాను కదా అందుకు కూడా సారీ చెప్పడానికి రాలేదు అంటాడు సూరజ్. అందుకు జ్యోత్స్న ఏదో చెప్పాలని వచ్చి ఏదో చెప్తున్నావా..? అంటుంది జ్యోత్స్న. ఇద్దరి మాటల యుద్దం జరుగుతుంది. తాను ఏది చెప్పాలని వచ్చానో అదే చెప్పాను.. అలాగే రేపు ఉదయం 9 గంటల కల్లా నా వన్ వీక్ ప్లాన్ చేసి పెట్టాలి లేదంటే నీ జాబ్ ఉండదు అంటూ సూరజ్ చెప్తాడు. సరే వెళ్తాను సార్ మనసులో ఉన్నది చెప్పుకోకపోతే నిద్ర పట్టదు ఒక్కసారి ఆలోచించుకోండి అంటే మనసులో ఉన్నదే చెప్పాను నువ్వు ఇక బయలుదేరు అంటాడు సూరజ్. జ్యోత్స్న వెళ్లిపోతుంది.
ఇంటి దగ్గర జ్యోత్స్న కోసం వెయిట్ చేస్తుంటారు దీప, కార్తీక్. వాళ్లను చూసిన జ్యోత్స్న ఏంటి నిద్ర పట్టడం లేదా..? బయట కూర్చున్నారు అని అడిగితే.. నువ్వు ఏ రాచకార్యాలు వెలగబెట్టడానికి వెళ్లావో తెలుసుకుందామని వెయిట్ చేస్తున్నాం అని దీప చెబితే.. చిన్న పని ఉండి వెళ్లాను అంటుంది జ్యోత్స్న. ఏం అంటున్నాడు సూరజ్ అని కార్తీక్ అడగ్గానే.. జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లావో మాకు తెలియదు అనుకున్నావా..? భోజనం చేస్తున్నప్పుడే నీకు ఫోన్ వచ్చింది. వెంటనే నువ్వు ప్లేట్ పట్టుకుని బయటకు వెళ్లావు తర్వాత చూస్తే ప్లేట్ బయట ఉంది.
ఇంట్లో స్కూటీ లేదు అందుకే నువ్వు సూరజ్‌ను దగ్గరకు వెళ్లావని అనుకున్నాము అంటూ దీప చెప్పగానే.. అవునని సూరజ్ ఫోన్ చేస్తే వెళ్లానని జరిగిన విషయం చెప్తుంది జ్యోత్స్న. ఇంట్లో ఈ విషయం తెలిస్తే అందరూ సీరియస్‌గా తీసుకుంటారు.. అంటూ కార్తీక్ చెప్తాడు. తప్పని తెలిసే ఇదంతా చేస్తున్నాను.. నేను ఎన్ని తప్పులు చేస్తానంటే సూరజ్ తన తప్పులు సరిదిద్దుకునేంత వరకు చేస్తూనే ఉంటానని చెప్తుంది జ్యోత్స్న. ఇదంతా అమ్మకు తెలిస్తే అని దీప అడిగితే.. మీరు ఏమనుకోవద్దు నా దారిలో నాకు ఎవరి సాయం అవసరం లేదు. గట్టిగానే పోరాడుదాం నాకు పని ఉంది నేను వెళ్తాను అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది.
మరుసటి రోజు టిఫిన్ చేస్తూ.. మాలిని, సూరజ్‌తో రాత్రి ఎక్కడకు వెళ్లావని అడుతుంది. వాడేం చిన్న పిల్లాడు కాదు కదమ్మా అంటూ దక్షిణమూర్తి అంటాడు. తల్లి ఆడపిల్లలనే కాదు కొడుకులను కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి.. దోశ చాలా బాగుంది. తిను అంటూ చెప్పగానే.. సూరజ్ దోశ తీసుకోవడానికి చేయి చాచగానే.. జ్యోత్స్న ఫైల్ చేతిలో పెడుతుంది. జ్యోత్స్నను చూసిన మాలిని షాక్ అవుతుంది. సారీ సార్ పది నిమిషాలు లేట్ అయింది అంటుంది. నువ్వెందుకు ఇంటికి వచ్చావు అంటూ మాలిని అడిగితే.. రాత్రి సార్ హెచ్చరించారు అందుకే ఇక్కడకు వచ్చి ఫైల్ ఇస్తున్నాను అంటూ ముందు రోజు ఆఫీసులో జరిగిన విషయాల నుంచి రాత్రి సూరజ్ తనను పార్కులో కలిసిన విషయం వరకు మొత్తం చెప్తుంది. మాలిని కోపంగా రేయ్ అది ఏం మాట్లాడుతుందిరా..? అంటుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.