Anushka Sharma Pregnant : విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మూడోసారి ప్రెగ్నెంట్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట ముంబైలోని వర్లీలో జరిగిన కృష్ణదాస్ భక్తి సంగీత కీర్తన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ విషయం బయటపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా అనుష్క శర్మకు సంబంధించిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. ఇందులో బేబీ బంప్ స్పష్టంగా కనిపించినట్టు ప్రచారం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అనుష్క శర్మ లూజ్ అనార్కలి డ్రెస్ ధరించిందని అంటున్నారు. ప్రెగ్నెంట్ ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి డ్రెస్సులు వేస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మూడోసారి తండ్రి కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ అభిమానులు సంబరపడిపోతున్నారు.
లండన్ లో సెటిల్ అయిన విరాట్ కోహ్లీ దంపతులు సమయం దొరికినప్పుడు ఇండియాకు వచ్చి చిల్ అవుతున్నారు. ముఖ్యంగా హిందూ దేవాలయాలు సందర్శిస్తూ…కీర్తనల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే లేటెస్ట్ గా ముంబైలో జరిగిన కృష్ణదాస్ భక్తి సంగీత కీర్తన కార్యక్రమానికి ఈ జంట హాజరైంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 25వ తేదీన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఈ కార్యక్రమంలో పాల్గొని సెంటర్ ఆఫ్ యాక్షన్ అయ్యారు. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అనుష్క శర్మ మూడోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆమెకు బేబీ బంప్ ఉందని పోస్టులు పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అందుకే లూస్ డ్రెస్ ధరించిందని కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కాగా ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ టీ20లతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య త్వరలో ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ లో కూడా విరాట్ కోహ్లీ ( Virat Kohli) బరిలోకి దిగనున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే దిశగా విరాట్ కోహ్లీ అడుగులు వేస్తున్నాడు. అప్పటి వరకు ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ.. టీమిండియా కు టైటిల్ తీసుకురావాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు.