Podarillu Today Episode October 27th: మాధవ్ తన కన్న తండ్రి ఎంత గొప్పదో తెలుసుకున్న తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతాడు. మా నాన్న నిజంగానే ఇలాంటివాడని నాకు అసలు తెలియదు నిజంగానే దేవుడు నా చంటి బిడ్డ లాగా కన్నాని పెంచాను కానీ వాడే మా నాన్నని ఇంట్లో నుంచి పంపించాలి అని చూస్తున్నాడు వాడికి నిజం తెలిస్తే ఏమైపోతాడు అని మాధవ్ చాలా బాధపడిపోతాడు. అయితే ఈ విషయాన్ని చక్రికి గాని కేశవ కి కన్నాకి అస్సలు చెప్పకూడదమ్మా వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. నారాయణని ఇన్ని రోజులు ఇలా చేసామని బాధ పడిపోతారు అని మాధవ్ గుడిలో మాట తీసుకుంటాడు.
చక్రీ కన్నా నారాయణ తీసుకొని వదిన వెళ్ళింది కదా.. ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే అప్పుడే మహాలక్ష్మి మాధవ్ ఇంట్లోకి రావడం చూసి ఏంటి నారాయణకు వెళ్లి అన్నయ్యతో వచ్చారు. ఏం జరిగింది అని అడుగుతారు కానీ వాళ్ళిద్దరూ పొంతన లేని సమాధానం చెప్పడంతో చక్రికి అనుమానం వస్తుంది.. నేను ఎవరు ఏం మాట్లాడుకున్నారు గుడికి వెళ్ళాను రా నేను కూడా అక్కడికి కలిసాను. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారని వినాలి అనుకున్న కానీ వాళ్ళు ఏం మాట్లాడుకోలేదు అని అక్కడ అనగానే వాళ్లకి కచ్చితంగా అనుమానం వస్తుంది.. కానీ మహాలక్ష్మి మాత్రం నారాయణ గొప్పవాడు అన్నట్లుగా మాట్లాడే వెళ్ళిపోతుంది. అయితే నారాయణ చాలా మంచివాడు అని కన్నాతో ఎంత చెప్పినా కూడా కన్నా మాత్రం అస్సలు వినకుండా తిరుగుతూ ఉంటాడు..
కేశవ ఇంటికి రాలేదు అని తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయలేదు అని తన బండిని తీసుకొని వెళ్లే వేలం చేయాలని అనుకుంటుంది. అయితే అది చూసిన కేశవ ఏంటి ఏం చేస్తున్నావే నువ్వు? నా బండిని వేలం వేస్తున్నావ్ ఏంటి అని అడుగుతాడు. కానీ శైలు మాత్రం చెప్పిన మాట వినని వాడితో ఎలా ఉండాలి. అసలు నువ్వు మనిషివేనా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని రావడానికి వెళ్లడానికి కూడా నీకు ఇబ్బంది అయినా.. మరి నీకెందుకురా బండి కచ్చితంగా దీన్ని నేను వేలం వేస్తాను కావాలంటే కొనుక్కోండి అని శైలు చాలా అంటుంది కానీ చివరికి కేశవ అందరిని తన మాటలతో పంపించేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి రాలేని వాడివి నీకెందుకురా బండి నువ్వు మనిషివేనా అని తిడుతుంది కూడా చివరికి కేశవ తనకి నవ్విస్తాడు.
మాధవ్ మటన్ బిర్యానీ చేసి అందరికీ గుమగుమగా సువాసనలు వెదజల్లు ఎలా చేయాలి అని అంటారు.. అయితే మాధవ్ చేసిన బిర్యానీ సువాసనలు ఎక్కడికో వెదజల్లుతున్నాయని ఇంట్లోని వాళ్ళందరూ కూడా గుమగుమలు వస్తున్నాయని అందరూ కూడా ఒక పట్టు పట్టాలి అని అనుకుంటారు అయితే మనిషా కోసం బిర్యాని తీసుకెళ్లాలి అని అనుకున్న మాధవ్.. ఇంట్లోని వాళ్లందరూ కూడా స్నానం చేసి రా కొండి అని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ మొహం కడుక్కోడానికి వెళ్ళినట్టే వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తూ ఉండిపోతారు.. అయితే మాధవ్ హాట్ బాక్స్ లో బిరియాని తీయడం చూసి ఎందుకు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు..
అయితే మాధవ్ బిర్యానీ పెట్టేసి అక్కడ ఫ్రెష్ అయ్యి రావాలి అని అనుకుంటారు.. అయితే అది చూసిన ముగ్గురు తమ్ముళ్లు మాధవ్ ని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటారు.. ఎలాగైనా సరే అన్నయ్య బిర్యానీ దాచిపెట్టి అన్నయ్యని ఏడిపించాలి అని అనుకుంటారు. ఒకచోట దాన్ని దాచి పెట్టేసి మాధవని ఆట పట్టిస్తాడు. మాధవ్ ఇందంతా వెతికి ఎక్కడ పెట్టాను అని ఆలోచిస్తూ ఉంటాడు చివరికి తమ్ముల దగ్గర అడ్డంగా దొరికిపోతాడు.. ఇక మహాలక్ష్మి దగ్గర కూడా మనీషాకి బిర్యానీ తీసుకెళుతున్నాను అని చెప్పగానే.. తను కూడా ఒక ఆట ఆడుకుంటుంది. మొత్తానికి మాధవ్ బిర్యాని తీసుకొని వెళ్తాడు.. మనిషా మాధవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి బిర్యాని తింటారు మనీషా మాధవ్ ఇద్దరూ చూపులతోనే ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమగా పలకరించుకుంటూ ఉంటారు. అది చూసిన బన్సీ వీరిద్దరూ కూర్చొని ఉండండి నేను వెళ్తాను అని అంటాడు.. మొత్తానికి వీళ్ళిద్దరికి కన్వర్జేషన్ ఎపిసోడ్కి కాస్త హైలైట్ గా నిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..