E-Paper
Advertisement

వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం

వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం
Advertisement

Cyclone Arnab: ఏపీ తీరం వైపు అర్నబ్ తుఫాన్ వేగంగా దూసుకొస్తోంది. తీరానికి సమీపానికి వచ్చేసింది. ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అర్ధరాత్రి నుంచి కుమ్మేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నాటికి యానాం తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా. ఫలితంగా కోస్తాంధ్ర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం.

ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఏపీ తీరానికి దూసుకొస్తోంది. మంగళవారం ఉదయం నాటికి అది తీవ్ర తుఫానుగా మారింది. గడిచిన 6 గంటల్లో 25 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం ఉదయం నాటికి విశాఖకు 300 కి.మీటర్లు, కాకినాడకు 360 కి.మీ, మచిలీపట్నంకు 460 కి.మీ, బాపట్లకు 530 కి.మీ దూరంలో కేంద్రీ కృతమైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

మంగళవారం సాయంత్రానికి పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగవచ్చని అంచనా వేశారు. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనిస్తుందని భావిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం నాటికి అర్నబ్ తుఫాన్ విశాఖపట్నం-బాపట్ల మధ్య యానాంకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అర్ధరాత్రి నుంచి ఉత్తరాంధ్ర-కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

అర్నబ్ తుఫాను కారణంగా మంగళ, బుధవారాల్లో ఏపీలోకి తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షాలు కుమ్మేస్తున్నాయి.  శ్రీకాకుళంలో అర్ధరాత్రి నుంచి విపరీతమైన గాలులు వీస్తున్నాయి. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు గాలులు తీవ్రమవుతున్నాయి. వర్షాలు పడే సమయంలో బలమైన గాలులు వీస్తున్నాయి.

Advertisement

కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గాలుల నేపథ్యంలో చెట్లు, భారీ హోర్డింగులు, శిథిల భవనాల వద్ద ఉండవద్దని ప్రజలను హెచ్చరించారు. మంగళ, బుధవారాల్లో ఏపీతోపాటు దక్షిణ ఒడిశా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక. మంగళవారం నుంచి విజయనగరం నుంచి గుంటూరు జిల్లాల వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ALSO READ: ప్రజాక్షేత్రంలో గెలవాలి కానీ.. ఇలా దోపిడీ చేయడం ఏంటి?: అనిల్ కుమార్ యాదవ్

అర్నబ్ తుఫాను ప్రభావం తెలంగాణపై పడింది. నేటి నుంచి రానున్న రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.  దీంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లటి గాలులు వీస్తున్నాయి. మంగళవారం రోజున వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలను వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

 

Related News

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. అలర్టయిన రైల్వే శాఖ, 53 రైళ్లు రద్దు!

ప్రజాక్షేత్రంలో గెలవాలి కానీ.. ఇలా దోపిడీ చేయడం ఏంటి?: అనిల్ కుమార్ యాదవ్

కర్నూలులో హైడ్రామా.. తొడ కొట్టి, మీసం తిప్పి టీడీపీకి హఫీజ్ ఖాన్ సవాల్!

ఇంజనీర్ లలిత కుమారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అందుకే చంపేసాడా..?

విశాఖ రేంజ్ మారబోతోంది.. తూర్పు తీరంలో ఇక శాన్‌ఫ్రాన్సిస్కో మ్యాజిక్!

టీడీపీ ఏకగ్రీవాలపై విజయసాయి కామెంట్స్.. ఇవేమీ నిజమైన పరీక్ష కావు, 2029 ఎన్నికలే అసలైన

‘వాళ్ళు గడ్డి తిన్నారని.. మీరూ అదే తింటారా’? కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్!

Big Stories

Advertisement
×