E-Paper
Advertisement

Cyclone Ditwah: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. విద్యార్థులకు అలెర్ట్, ఇవాళ ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

Cyclone Ditwah: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. విద్యార్థులకు అలెర్ట్, ఇవాళ ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
Advertisement

Cyclone Ditwah:  రెండు రోజులుగా తీరప్రాంత జిల్లాల ప్రజల్ని వణికిస్తోంది దిత్వా తుఫాను. ఆదివారం సాయంత్రం తీవ్ర వాయుగుండంగా బలహీన పడి, సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీని కారణంగా ఏపీపై భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తుఫాను నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. విద్యార్థులకు అలెర్ట్

Advertisement

దిత్వా తుఫాన్‌ దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తోంది. దీని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి వాతావరణంలో పలుమార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి కారణంగా నెల్లూరు జిల్లాలో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

దిత్వా తుఫాన్ కారణంగా ఏపీ ప్రభుత్వం యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు హోంమంత్రి అనిత.  నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

Advertisement

నెల్లూరు జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు నేడు సెలవు

క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు ఆ జిల్లాల మంత్రులు నారాయణ, ఆనంలు వరదలు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

నెల్లూరు, సర్వేపల్లి, కోవూరు ప్రాంతాల్లో ఆదివారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ఆ జిల్లాలో జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా మారాయి. కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  తుఫాను కారణంగా తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

ALSO READ: కృష్ణాలో పునర్విభజన వివాదం

చిరు జల్లులతో మొదలైన వర్షం.. భారీగా వర్షం పడుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లాలోని చీరాట, వేటపాలెం బీచ్ లను మంగళవారం వరకు మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అటు కోనసీమ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి చిరు జల్లులు పడ్డాయి.

వర్షానికి ఈదురుగాలులు తోడు కావడంతో పంటలు దెబ్బతిన్నాయి. అటు కోస్తాంధ్రాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం వరకు మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మరోవైపు క‌డ‌ప‌, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×