BigTV English
Advertisement

Cyclone Montha: ఏపీలో వేగంగా కదులుతున్న మొంథా.. కాకినాడ తీరానికి, అత్యంత భారీ వర్ష సూచన

Cyclone Montha: ఏపీలో వేగంగా కదులుతున్న మొంథా.. కాకినాడ తీరానికి, అత్యంత భారీ వర్ష సూచన

Cyclone Montha: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను అలజడి రేపుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాన్ గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరికాసేపట్లో ఇది తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.


ఏపీని కుదిపేస్తున్న మొంథా తుపాను

ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మొంథా ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వెల్లడించింది.


తుపాను ప్రభావం ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

తీవ్రతుపానుగా మారిన మొంథా

అంతర్వేది, రాజోలు, అమలాపురం, దేవగుప్తం, కాట్రేనికోన, పోలవరం, యానాం, గుట్టెనదీవి, ముమ్మిడివరం దగ్గర తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తోంది వాతావరణ కేంద్రం.  తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గంటల 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే కోస్తాలోని పలు ప్రాంతాల్లో సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

తీరం దాటే సమయంలో ఈ స్థాయి పెరగవచ్చని తెలిపింది. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపింది. కోస్తాంధ్ర, యానాంలో మంగళ, బుధవారాల్లో అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దాదాపు 21 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదు అయ్యే అవకాశముందని తెలిపింది. ఐదురోజులపాటు ఏపీలో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశముంది.

ALSO READ:  గ్రేటర్ తిరుపతి సాధ్యమేనా, అడ్డంకులు ఏంటి?

తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంది. ప్రజలు వదంతులు నమ్మకుండా వాస్తవ సమాచారం తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. అలాగే అవసరమైన సాయం కోసం ఆ నెంబర్లను సంప్రదించాలని కోరింది. స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ల 112, 1070, టోల్ ఫ్రీ నెంబర్లు 18004250101.

Related News

Montha In Vizag: మొంథా తుపాను.. విశాఖలో భారీ వర్షాలు, పలుచోట్ల విరిగిన చెట్లు, రంగంలోకి అధికారులు

AP Govt: మొంథా తుపాను.. నవంబర్ రేషన్ నేటి నుంచి పంపిణీ, ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Tirupati: గ్రేటర్ తిరుపతి సాధ్యమేనా? ఇందుకు ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి?

Ananthpuram: అనంతపురంలో దారుణం.. తల్లిపై కక్షతో నాలుగేళ్ల బాలుడి దారుణ హత్య

AP Schools Holiday: మొంథా తుపాను ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.. ఎయిర్ సర్వీసులు రద్దు

Badvel: బద్వేల్ టీడీపీ.. కొత్త బాస్ ఎవరంటే?

Palnadu: వారసుల కోసం ఎమ్మెల్యేల స్కెచ్.. పల్నాడులో ఏం జరుగుతోంది?

Big Stories

×