Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మకు రామ్మూర్తి ఫోన్ చేసి పండగకు రమ్మని చెప్తాడు. దీంతో మిస్మమ్మ మేము అక్కడికి ఎందుకు నాన్న మీరే ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా అంటుంది. దీంతో రామ్మూర్తి అయ్యో పండగ పూట అత్తారింటికి అల్లుడు వస్తే బాగుంటుంది కానీ అక్కడికి నేను ఎలా వస్తాను అమ్మా అంటాడు. మిస్సమ్మ మాత్రం ఏం కాదు నాన్న మీరే ఇక్కడికి రండి అని చెప్తుంది. రామ్మూర్తి అది పద్దతి కాదులే అమ్మా అల్లుడు గారు ఉంటే ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతాను అంటాడు. ఇంతలో అక్కడికి అమర్ రాగానే.. నాన్న ఇదిగో ఇప్పుడే ఆయన వచ్చారు మా నాన్న గారు మీతో మాట్లాడతారంట అని మిస్సమ్మ ఫోన్ ఇవ్వగానే అమర్ చెప్పండి మామయ్య అని అడుగుతాడు. దీంతో రామ్మూర్తి బాబుగారు రేపు పండగకి మీరు అమ్మాయి, పిల్లలు మన ఇంటికి భోజనానికి రావాలి బాబు అంటాడు.
దీంతో అమర్ నేనే మీకు ఫోన్ చేసి చెబుదామనుకున్నాను.. రేపు పండగక్కి మీరు అత్తయ్య గారు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పగానే.. అక్కడికి మేము ఎందుకు బాబు.. అంటాడు రామ్మూర్తి.. పండగకి మామయ్య అందరం కలిసి ఇక్కడే పండగ చేసుకుందాం.. అని చెప్పగానే.. అది కాదు బాబు మేము అక్కడికి రావడం ఏం బాగుంటుంది. మీరే ఇక్కడికి వస్తే.. అని చెప్పబోతుంటే మేమంతా అక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా..? మేము ఆరు మందిమి అక్కడికి రావడం కంటే మీరు ఇద్దరూ ఇక్కడికి రావడం మంచిది మామయ్య.. ఇంకేం చెప్పకండి మామయ్య మీరు వస్తున్నారంతే.. మీకోసం బట్టలు కూడా కొనేశాను.. రేపు మీకోసం ఇష్టమైన పిండి వంటలు కూడా చేయించాను.. ఈవెనింగ్ అందరం కలిసి జాలీగా టపాసులు కాలుద్దాం అంటాడు. దీంతో రామ్మూర్తి ఎమోషనల్ అవుతుంటాడు.
అమర్ మామయ్య గారు వింటున్నారా..? అని అడగ్గానే.. వింటున్నాను బాబుగారు.. నాకు ఇద్దరూ కూతుళ్లే అని అప్పుడప్పుడు బాధపడేవాణ్ని ఇప్పుడు మీ మాటలు వింటుంటే కొడుకు లేడన్న కొరత తీరినట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం బాబు.. మనసుకు తృప్తిగా ఉంది అనగానే.. రేపు వస్తారు కదా..? తప్పకుండా రావాలి అని అమర్ చెప్పగానే.. వస్తాను బాబు తప్పకుండా వస్తాను.. అంటూ కాల్ కట్ చేస్తాడు రామ్మూర్తి. కాల్ కట్ చేశాక మిస్సమ్మ ఎమోసనల్ అవుతూ అమర్‌ను హగ్ చేసుకుంటుంది. భాగీ ఏమైంది భాగీ అని అమర్ అడగ్గానే..
నువ్వు మా నాన్నతో మాట్లాడుతుంటే.. ఒక మామ అల్లుడు మాట్లాడుకున్నట్టు లేదు.. ఒక తండ్రితో కొడుకు మాట్లాడుతున్నట్టు ఉంది అంటాడు అమర్. దీంతో ఆయన పాలిట దేవుడు కూడా మీరేనండి.. అక్క కోసం నా కోసం ఆయన ఎంతగా ఆరాటపడ్డాడో ఒక మంచి మనిషి చేతిలో మమ్మల్ని పెట్టారని ఆయన సంతోష పడని రోజంటూ లేదు.. ఆయన జీవితపు ఆఖరి దశలో ఇంత ఆనందాన్ని ఇస్తున్న మీకు చాలా థాంక్స్ అండి.. అంటూ అమర్‌ను మొక్కుతుంది. దీంతో అమర్ ఏంటి భాగీ ఏదేదో మాట్లాడుతున్నావు.. నాకు మా నాన్న ఎంతో మీ నాన్న కూడా అంతే నేనేం పరాయి వాణ్ని కాదు ఆయన అల్లుడిని అంటూ అమర్ వెళ్లిపోతాడు.
తర్వాత రూంలో ఉన్న చంభా దగ్గరకు అంజు వెళ్లి అనుమానంగా చూస్తుంది. చంభా భయంతో అటూ ఇటూ తిరుగుతుంది. అంజు చుట్టూ తిరుగుతూ చూస్తుంది. దీంతో చంభా ఏంటి పాల చుట్టి చుట్టి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. నిన్ను ఎక్కడో చూశాను. కానీ ఎక్కడ చూశాను.. ఉదయం నుంచి గుర్తు రావడం లేదు అంటుంది అంజు. దీంతో చంభా మాది ఈ ఊరు కాదమ్మా.. వేరే ఊరు నన్ను నువ్వు చూసే అవకాశమే లేదు.. అంటుంది చంభా.. మనం ఎప్పుడో ఎక్కడో కలిశాం అంటుంది అంజు. లేదమ్మా మనం ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదు.. అంటుంది చంభా.. నాకు సామాన్యంగా డౌటు రానే రాదు.. వచ్చిందనుకో అది తీరే వరకు అసలు ఆగను అంటుంది అంజు. దీంతో చంభా దేవుడా ఈ పిల్ల రాక్షసి నుంచి నన్ను కాపాడు.. ఎవరో ఒకరు ఇటు వచ్చేలా చేయి స్వామి అని మనసులో అనుకుంటుంది.. ఇంతలో అక్కడికి మనోహరి వస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.