BigTV English
Advertisement

Palnadu: వారసుల కోసం ఎమ్మెల్యేల స్కెచ్.. పల్నాడులో ఏం జరుగుతోంది?

Palnadu: వారసుల కోసం ఎమ్మెల్యేల స్కెచ్.. పల్నాడులో ఏం జరుగుతోంది?

Palnadu:  పల్నాడులో గత ఎన్నికల్లో ఫ్యాక్షన్ వాతావరణం కనిపించింది.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక‌ృష్ణారెడ్డి వరుస కేసులతో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. రాజకీయాల కంటే కూడా… విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులకి పల్నాడుకు కేంద్రంగా నిలుస్తోంది. అటువంటి చోట గొడవలు, వివాదాలు, ఫ్యాక్షన్ తెలియని యువతరం నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే తమ వారసులనుబరిలో నిలపడానికి పోటీ పడుతున్నారు


అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారుసుల ఎంట్రీ:

ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మనాయుడు పరిపాలించిన ప్రాంతం. కవి శ్రీనాథుడి శాపంతో నేటికీ నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రాంతంలో రాజకీయ నాయకులు తమ వారసుల్ని వచ్చే ఎన్నికల్లో బరిలో దించబోతున్నారు. పల్నాడు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు వారి రాజకీయ వారసులని ఇప్పటి నుంచే ప్రమోట్ చేసుకుంటున్నారు.

వారసుల రాజకీయ భవిష్యత్తుకు తండ్రులు పునాదులు:

ప్రకాశం జిల్లాకు సరిహద్దుగా ఉన్న చిలకలూరిపేట, తెలంగాణకు సరిహద్దుగా ఉన్న గురజాల మాచర్ల, ఉమ్మడి గుంటూరు జిల్లాకు నడిబొట్టునున్న సత్తెనపల్లిలో వచ్చే ఎన్నికల్లో తమకు బదులు వారి తనయులని బరిలో దింపాలని నలుగురు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అధిష్టానం అవునన్నా కాదన్నా ఇప్పటి నుంచే వారి రాజకీయ భవిష్యత్తుకు తండ్రులు పునాదులు వేస్తున్నారు.


మాచర్లలో గౌతమ్‌రెడ్డిని యాక్టివ్ చేసిన బ్రహ్మారెడ్డి:

మాచర్ల నియోజకవర్గం నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి తన రాజకీయ వారసుడ్ని ప్రకటించారు. గురజాల నియోజకవర్గం నుంచి 1973, 1983లో బ్రహ్మారెడ్డి తండ్రి జులకంటి నాగిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి తల్లి దుర్గంబ ఎమ్మెల్యేగా గెలిచారు.. 2024లో మాచర్ల ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డి గెలుపొందారు. 2029 ఎన్నికల్లో ఆయన తన కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని ఆశ పడుతున్నాడు. కొడుకు గౌతమ్ రెడ్డిని ఇప్పటికే పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్ చేశారు బ్రహ్మారెడ్డి…

కొడుకు నిఖిల్‌ని బరిలోకి దింపనున్న యరపతినేని:

పల్నాడులో ఫ్యాక్షన్ కి అడ్డా అయినా గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యారపతినేని శ్రీనివాసరావు తన 30 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడిని రంగంలో దింపేందుకు గత కొన్ని సంవత్సరాలుగా కార్యచరణ రూపొందిస్తున్నారు. 1994 నుంచి 2024 వరకు టీడీపీ తరపున ఏడుసార్లు గురజాల నియోజకవర్గం నుంచి యరపతినేని పోటీ చేశారు. నాలుగు సార్లు గెలిచారు మూడుసార్లు ఓటమి పాలయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి తన కుమారుడు నిఖిల్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో గత నాలుగు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో నిఖిల్ పాల్గొంటూ వస్తున్నారు.

నాగరాజుని నిలబెట్టాలని దృఢ సంకల్పంతో లక్ష్మీనారాయణ@:

మరో నియోజకవర్గం నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ… గత 40 సంవత్సరాలు కాలంగా పెదకూరపాడు, గుంటూరు 2, సత్తనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు..కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక దఫాలు మంత్రి పదవిని చేపట్టారు. గతంలో ఆయన కుమారుడు నాగరాజు గుంటూరు డిప్యూటీ మేయర్, మేయర్ గా పని చేశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు టూ నుంచి గాని సత్తనపల్లి నుంచి గాని తన కుమారుడు నాగరాజుని ఎన్నికల బరిలో నిలబెట్టాలని కన్నా దృఢ సంకల్పంతో ఉన్నారు.. ఇప్పటికే నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ కార్యకర్తలకు నాయకులకు చేదుడు వాదోడుగా ఉంటున్నాడు కన్నా నాగరాజు.

వైసీపీ హయాంలో జైలుకు వెళ్లి వచ్చిన పుల్లారావు వారసుడు:

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గం, ప్రకాశం జిల్లా కి సరిహద్దు నియోజకవర్గం చిలకలూరిపేట… ఎంతో రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గం లో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నాలుగు సార్ల నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 14 మధ్య19 లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కూడా తాజా రాజకీయాల్లోకి తన కుమారుడు శరత్‌ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తండ్రి గెలుపు కోసం శరత్ విశేష కృషి చేశారు. వైసిపి సర్కార్లో అగ్రిగోల్డ్ వ్యవహారంలో పుల్లారావు కుమారుడు శరత్ జైలుకు వెళ్లి వచ్చాడు. అప్పటినుంచి శరత్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ తండ్రికి అండగా నిలుస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో పలనాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి నాలుగు నియోజకవర్గాలకి లోకేష్ సైన్యంగా తండ్రులు ఆ నలుగురిని తయారు చేస్తున్నారంట. ఇప్పటికే లోకేష్ అడుగుజాడల్లో నడుస్తూ ఈ నలుగురు ఆయా నియోజకవర్గాల పరిధిలో తండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. మరి చూడాలి ఆ వారసుల పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుందో.

Story by Apparao, Big tv

Related News

Tirupati: గ్రేటర్ తిరుపతి సాధ్యమేనా? ఇందుకు ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి?

Ananthpuram: అనంతపురంలో దారుణం.. తల్లిపై కక్షతో నాలుగేళ్ల బాలుడి దారుణ హత్య

AP Schools Holiday: మొంథా తుపాను ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.. ఎయిర్ సర్వీసులు రద్దు

Badvel: బద్వేల్ టీడీపీ.. కొత్త బాస్ ఎవరంటే?

Anantapur: అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా పాపంపేట భూవివాదం

Cyclone Montha: మొంథా తుఫాను.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీ ప్యూచర్ ఎలా ఉండబోతుందంటే ?

Big Stories

×