BigTV English

Cyclone Michaung Effect: అల్లకల్లోలం సృష్టిస్తోన్న మిగ్ జాం.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

Cyclone Michaung Effect: అల్లకల్లోలం సృష్టిస్తోన్న మిగ్ జాం.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

Cyclone Michaung Effect: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుఫాను ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 170 కిలోమీటర్లు, నెల్లూరుకు 20 కిలోమీటర్లు, బాపట్లకు 150 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.


మంగళవారం మధ్యాహ్నానికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల వద్ద తీవ్ర తుఫానుగా మారి, తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బుధవారం రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

michaung latest update
michaung latest update

తుఫాను ప్రభావంతో ఏపీలో 9 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, కడప, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఏపీ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.


తుపాను ప్రభావం ప్రకాశం జిల్లాపై అధికంగా కనిపిస్తోంది. కొత్తపట్నం, సింగరాయకొండ , టంగుటూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రెడ్ అలర్ట్ మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. కొత్తపట్నం ప్రాంతంలో సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లిక గార్గ్ వర్షాలపై ప్రత్యేక దృష్టి సారించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తుఫాను సేఫ్టీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×