E-Paper
Advertisement

Telangana CM: ఢిల్లీ చుట్టూ తెలంగాణ రాజకీయం.. సోనియమ్మ మనసులో ఏముంది ?

Telangana CM: ఢిల్లీ చుట్టూ తెలంగాణ రాజకీయం.. సోనియమ్మ మనసులో ఏముంది ?
Advertisement
telangana congress party news

Telangana CM news(Telangana congress party news):

తెలంగాణ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా కొలిక్కిరాకపోవడంతో హస్తినలో జోరుగా మంతనాలు సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను మట్టికరింపించి విజయఢంకా మోగించిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం సీటు సహా కీలక పదవులకు కోసం ఎదురు చూస్తున్నారు. సోనియమ్మ మనసులో ఏముందన్నటెన్షన్‌లో ఉన్నారు. సీఎం పీఠం రేవంత్‌కు కేటాయించినట్టు తెలుస్తున్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయేసరికి ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. డీకే శివకుమార్‌ నేతృత్వంలో పలు దఫాలుగా చర్చలు సాగిస్తున్న నేతలు హస్తినలో మకాం వేశారు.

సోమవారం నాడే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేస్తారని జోరుగా ప్రచారం జగడంతో అంతా అదే ఊహించారు. అందుకోసం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయేసరికి సీఎం ఎవరన్నదానిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. మరోపక్క సీఎం పదవి కోసం సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుబడుతుండటంతో గత ఆదివారం నుంచి ఈ వ్యవహారంపై చర్చలు సాగుతున్నాయి. అయితే.. మెజార్టీ ఎమ్మెల్యేలంతా రేవంత్‌ వైపు మొగ్గు చూపగా.. అధిష్టానం మనసులోనూ అదే ఉండటంతో ఇవాళ సీఎంగా రేవంత్‌ పేరును ప్రకటించే అవకాశముంది.

Advertisement

ఇక నేడు కూడా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనుంది అధిష్టానం. ఈ మేరకు ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఢిల్లీకి చేరుకున్నారు. డీకేతోపాటు తెలంగాణ ఇన్చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే మరో ముగ్గురు పరిశీలకులు మంతనాలు జరుపనున్నారు. డీకే బృందం ఇచ్చే నివేదిక, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్‌ తెలంగాణ ముఖ్యమంత్రిని నిర్ణయించనుంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×