Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వార్త తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా వెల్లడించారు.
సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే హరీశ్‌రావుకు ఫోన్ చేసి పరామర్శించారు కేసీఆర్. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని సూచన చేశారు. ఆయనతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కేసీఆర్.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరీష్‌రావుని మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ పరామర్శించారు. అటు కేటీఆర్ ఇంటికి వెళ్లి హరీష్‌రావు కుటుంబసభ్యులను ఓదార్చి, సంతాపం తెలిపారు. సత్యనారాయణరావు అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సత్యనారాయణరావు. ఆయన మరణవార్త తెలియగానే పలువురు పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు, ఆయన సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. హరీష్‌రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
మాజీ మంత్రి, సిద్ధిపేట శాసన సభ్యుడు శ్రీ తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— Revanth Reddy (@revanth_anumula) October 28, 2025
హరీష్ రావుకు పితృవియోగం
వృద్ధాప్య సమస్యలతో హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూత.. pic.twitter.com/mhdj40Kll7
— BIG TV Breaking News (@bigtvtelugu) October 28, 2025