BigTV English

AP Cyclone warning: దసరా ముసురా? ఆకాశం ముసుగేసింది

AP Cyclone warning: దసరా ముసురా? ఆకాశం ముసుగేసింది

AP Cyclone warning: రెండురోజులుగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏపీకి మరో తుపాను పొంచి వుందని తెలిపింది. దీనికి కారణంగా ఏపీతోపాటు తెలంగాణలోనూ పలుచోట్లు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.


నార్మల్‌గా చవితి, దసరా తుపాన్లు వస్తాయని  పెద్దలు అప్పుడప్పుడు చెబుతుంటారు. దసరా దగ్గరపడడంతో ఈసారి తుపాను లేకపోవడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు.  ముఖ్యంగా అధికారులు కాస్త రిలాక్స్ అయ్యారు.

తాజాగా ఏపీని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మరో రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. ఇది అల్పపీడనంగా మారి, చివరకు వాయిగుండంగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసింది.


అంతా అనుకున్నట్లు జరిగితే ఈనెల 17న ఏపీలో తీరం దాటే అవకాశముందని భావిస్తోంది. ఇది తుపానుగా బలపడి దక్షిణ ఏపీ, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటు వర్షాలు కురుస్తున్నాయి.

ALSO READ: దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. తిరుమలలో దివ్వెల మాధురి న్యూసెన్స్ రీల్స్.. కేసు నమోదు

దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీనిపై ప్రభావం తెలంగాణపై పడింది. గురువారం నుంచి వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్నారు. పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.

మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. కర్ణాటక, గోవా తీరాల సమీపంలో కేంద్రీకృతమైంది. ఇది ప్రస్తుతం వాయవ్య దిశగా వేగంగా కదులుతోంది. ఇది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×