BigTV English

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అత్తకోసం పరుగెత్తుకెళ్లిన రాజ్‌ – ఆఖరి కోరిక నెరవేరుస్తానని హామీ

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అత్తకోసం పరుగెత్తుకెళ్లిన రాజ్‌ – ఆఖరి కోరిక నెరవేరుస్తానని హామీ

Brahmamudi serial today Episode:   అపర్ణ, ఇందిరాదేవి కంగారు పడటం చూసిన రాజ్ విషయం ఏంటని అడిగినా ఎవ్వరూ  చెప్పరు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూడా సరిగ్గా తినకుండా అందరూ బాధపడుతుంటే రాజ్‌ ఇగో పక్కన పెట్టైనా నిజం తెలుసుకోవాలనుకుంటాడు. తర్వాత గార్డెన్‌ లో కూర్చున్న  అపర్ణ దగ్గరకు వెళ్లి  ఏమైంది మమ్మీ.. ఏం జరుగుతుంది ఇక్కడ..?  అని అడుగుతాడు. దీంతో ఏ విషయం గురించి అడుగుతున్నావురా? అంటుంది అపర్ణ.


అదే ఆ కళావతి విషయం.. ఆవిడ గారికి ఏమైందట అంటాడు. ఏమైతే నీకెందుకురా? నువ్వే కదా పిల్ల గురించి చెప్పొద్దు..పిల్ల తల్లి గురించి చెప్పొద్దు అన్నావు అంటుంది అపర్ణ. ఇందిరాదేవి కూడా మమ్మల్ని ఏమీ అడగొద్దు అని చెప్తుంది. ఇరిటేటింగ్ గా రాజ్  ఏమైందో చెప్తేనే కదా తెలిసేది. సాటి మనిషిగా ఆమాత్రం తెలుసుకోకూడదా? ఆ హక్కు నాకు లేదా? అంటాడు. అవునా  ఆ మాట కొస్తే ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే హక్కు లేదు. అవసరం లేదు. ఆ దేవుడే ఉన్నాడు. ఆయనే అంతా చూసుకుంటారు అంటుంది అపర్ణ.

అయితే ఏమీ చెప్పనప్పుడు మీరంతా ఎందుకు పాపం కావ్య అంటూ ఎందుకు ఆలోచిస్తున్నారు అంటూ నిలదీస్తాడు రాజ్‌. అయితే మేము ఏమీ చెప్పలేమని అపర్ణ, ఇందిరాదేవి బాధగా వెళ్లిపోతుంటే మీరు చెప్పకపోతే కళ్యాణ్‌ను అడిగి తెలుసుకుంటాను అంటాడు రాజ్. దీంతో షాక్‌ అయిన అపర్ణ, ఇందిరాదేవి మొదటికే మోసం వచ్చేలా ఉందని రాజ్‌ దగ్గరకు వచ్చి నిజం చెప్తారు. కనకానికి కాన్సర్‌ అట.. ఎక్కువ రోజులు బతకదట.. అందుకే పాపం కావ్య అటు మొగుడికి దూరం అయి.. ఇప్పుడు తల్లి కూడా లేకపోతే ఏమౌతుందోనని ఆలోచిస్తున్నాము అంటారు.


షాక్ అయిన రాజ్‌. మొన్న వినాయక చవితికి వచ్చినప్పుడు బాగానే ఉంది కదా మమ్మీ అని అడుగుతాడు.  ఏం బావుంది. మన రుద్రాణి, ధాన్యలక్ష్మీ అంత రెచ్చగొట్టినా ఇంతకముందులా కాకుండా ఎంత సైలెంట్‌గా వెళ్లిపోయింది చూశావుగా అంటుంది అపర్ణ. దీంతో అవును మమ్మీ నిజమే అంటూ ఇంతకీ ఈ విషయం కావ్యకు తెలుసా? అని అడుగుతాడు. తెలియదు.. చెప్పలేదు అని ఇందిరాదేవి, అపర్ణ చెప్తారు. అయితే చెప్పకండి నిజం తెలిస్తే  ఆ కళావతి తట్టుకోలేదు అంటాడు రాజ్‌.

కానీ కనకమే తన ఆఖరి కోరిక తీర్చమని అడిగింది. అది మేము తీర్చలేము అంటారు అపర్ణ, ఇందిరాదేవి. ఏంటి తన కూతురును నేను ఇంటికి తీసుకురావాలనా? అంటూ ఇరిటేటింగ్‌ గా అడుగుతాడు రాజ్‌. కాదని నువ్వు కనకాన్ని ఇంతేనా అర్థం చేసుకుందని అంటారు. మరేంటో చెప్పండి అని రాజ్ అడిగినా చెప్పరు. దీంతో రాజ్‌ అదేంటో అత్తయ్యనే అడిగి తెలుసుకుంటానని కనకం ఇంటికి వెళ్తాడు. అపర్ణ, ఇందిరాదేవి, కనకానికి ఫోన్‌ చేసి రాజ్‌ వస్తున్నాడని చెప్తారు.

కనకం శాలువా కప్పుకుని ఏడుస్తూ ఉంటుంది.  బ్యాక్‌ గ్రౌండ్‌ లో ఆగదు.. ఆగదు అనే తెలుగు పాట వినిపిస్తుంది.  పాట కంప్లీట్‌ అయ్యాక కనకం వరండాలో లాయర్‌ తో మాట్లాడుతుంది. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. రాజ్‌ ను చూసి కనకం కింద పడబోతుంటే రాజ్‌ పట్టుకుని కుర్చీలో కూర్చోబెడతాడు. అత్తయ్యా ఏంటిదంతా అని అడుగుతాడు. ఏం లేదు బాబు నా తదనంతరం ఈ ఇల్లు నా అల్లుళ్లకే  చెందాలని వీలునామా రాయిస్తున్నాను అని చెప్తుంది. ఇల్లు మాకు ఇస్తే మామయ్యగారు వాకిట్లో పడుకుంటారా? అంటూ లాయర్‌ ను వెళ్లిపోమ్మని చెప్తాడు.

లాయర్‌ వెళ్తూ ఆఖరి క్షణంలో అవసరం అయితే కబురు చేయండి అంటాడు. దీంతో అయ్యో ఎంత మాట అన్నారు లాయర్‌ గారు మా అల్లుడికి విషయం తెలియదు అంటుంది కనకం. దీంతో నాకు విషయం మొత్తం తెలుసు అత్తయ్యగారు అంటూ రాజ్‌ కనకాన్ని ఓదారుస్తాడు.  నిజం విని తట్టుకోలేకపోతున్నాను మీ ఆఖరి కోరిక ఏంటో చెప్పండి అని అడుగుతాడు. దీంతో వద్దులే బాబు వదిలేయండి అంటుంది. నన్ను మీరు కొడుకులాగా అనుకుని మీ ఆఖరి కోరికేంటో చెప్పండి నేను నెరవేరుస్తాను. లేకపోతే నేను బతికే చివరి క్షణం దాకా బాధపడతాను అంటాడు.

అయితే నువ్వు కొడుకులా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను బాబు అంటూ కనకం. రేపు మాది 25వ పెళ్లి రోజు. ఆ పెళ్లి రోజును నా ముగ్గురు కూతుర్లు, అల్లుళ్లతో ఘనంగా జరుపుకోవాలని ఉంది బాబు అంటుంది. దీంతో రాజ్ మీ కూతుర్లు, అల్లుళ్లే కాదు మా కుటుంబం మొత్తం వస్తుంది. మీ యానివర్సరీని గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ నేను చేస్తాను అత్తయ్యగారు అంటాడు రాజ్‌. దీంతో కనకం ఫుల్‌ హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత రాజ్ వెళ్లిపోతాడు.

రాజ్ కారు స్టార్ట్‌ చేసుకుని వెళ్తుంటే కావ్య వస్తుంది. రాజ్‌ ను చూసి ఎందుకొచ్చాడు అని లోపలికి వెళ్లి కనకాన్ని అడుగుతుంది. తనకు ఏమీ తెలియదని చెప్తుంది కనకం. అవునా అంటూ కావ్య లోపలికి వెళ్లాక అపర్ణ, ఇందిరాదేవిలకు కనకం ఫోన్‌ చేసి జరిగింది మొత్తం చెప్తుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Big Stories

×