E-Paper
Advertisement

Pawan Kalyan: తుపానుతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం.. యుద్ధ ప్రాతిపదికన పంటనష్టం అంచనా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తుపానుతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం.. యుద్ధ ప్రాతిపదికన పంటనష్టం అంచనా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Advertisement

Pawan Kalyan: మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.38 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46 వేల హెక్టార్లలో నష్టం కలిగిందని చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, అధైర్య పడవద్దని పవన్ భరోసా ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. మొంథా తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం కృష్ణా జిల్లా అధికారులు అవనిగడ్డలో తుపాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన పరిశీలించారు.

కౌలు రైతులను ఆదుకుంటాం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ముందస్తు సన్నద్ధతతో మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రతను తగ్గించామన్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపు కారణంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్సులు, ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అటు యంత్రాంగాన్ని, ఇటు గ్రామ స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్షా 16 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ విపత్తులో కౌలు రైతులు కూడా నష్టపోయిన విషయం తన దృష్టికి వచ్చిందని, వారిని ఆదుకొనే అంశాన్ని సీఎం తీసుకువెళతానన్నారు.

అంటు వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్

Advertisement

“తుపాను అనంతరం శానిటేషన్ చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సుమారు 274 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. దెబ్బతిన్న అన్ని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించాం. పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతో పాటు అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో సూపర్ శానిటేషన్.. సూపర్ క్లోరినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. జిల్లాల వారీగా పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా విభజించి పారిశుద్ధ్య మెరుగు పర్చే చర్యలు మొదలు పెట్టాం. 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం కాగా, మొత్తం 21,055 మంది సిబ్బందిని పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్నాం. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఇబ్బంది ఏర్పటిన చోట్ల ప్రయత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం” – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఇళ్లకు వెళ్లే ముందే ఆర్థిక సాయం

మొంథా ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి 25 కేజీల బియ్యాన్ని, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, కేజీ పంచదార కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందన్నారు. శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందే ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున ఇస్తున్నామన్నారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ. 3 వేలు చెల్లించనున్నామన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక నివేదిక రాగానే కేంద్ర సహకారం కోరుతామన్నారు.

Advertisement

Also Read: YS Sharmila: ఏపీపై మోదీకి సవతి తల్లి ప్రేమ: షర్మిల ఆగ్రహం

“కోడూరు మండల పరిధిలో సముద్రం కట్టపై దెబ్బ తిన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ కొత్తగా నిర్మించడానికి నాబార్డ్ సాయం తీసుకుంటాం. ఎదురుమొండి దీవుల్లో సముద్ర కోతకు గురై దెబ్బ తిన్న ఎదురుమొండి-గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.08 కోట్ల కేటాయించామని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యిందని, దీని ద్వారా ఐదు గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తీరనున్నాయి” అని పవన్ అన్నారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×