Azharuddin Oath: రేపు తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో రేపు మధ్యాహ్నం 12:15 గంటలకు అజారుద్దీన్ చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మైనార్టీ, హైదరాబాద్ కోటాలో అజార్ కు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వం ఆహ్వాన లేఖలు అందజేసింది.
అయితే.. అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడాన్ని తక్షణమే ఆపివేయాలని ఈసీకి తెలంగాణ బీజేపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడమంటే.. మైనార్టీ వర్గం ఓట్లపై ఎఫెక్ట్ ఉంటుందని బీజేపీ నాయకులు అంటున్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే వరకు అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడాన్ని పోస్ట్ పోన్ చేయాలని ఈసీని కోరారు. బీజేపీ శాసనసభా పక్ష డిప్యూటీ నాయకుడు పాయల్ శంకర్, బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి లు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ALSO READ: Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ బైపోల్.. గెలుపు వార్ వన్ సైడే: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి